పోకు పోకు మంత నీవు పురుషోత్తమా వట్టి
(॥పల్లవి॥)
పోకు పోకు మంత నీవు పురుషోత్తమా వట్టి
బూకలు మే మెఱుఁగమా పురు‘షోత్తమా
(॥పోకు॥)
పొలసులాడకు నీవు పురుషోత్తమా నీ
పొల జాణతనాలు పురుషోత్తమా
పులుసువేసి నీ చెంత పురుషోత్తమా నేము
పులు గరసితి మింత పురుషోత్తమా
(॥పోకు॥)
పొడవాటి సటకాఁడ పురుషోత్తమా
పొడమె నీ మోవినవ్వు పురుషోత్తమా
పుడిశెఁడే నీ సిగ్గు పురుషోత్తమా
పొడిరాలి రతులలో పురుషోత్తమా
(॥పోకు॥)
పొద్దువొద్దు కొత్త లేల పురుషోత్తమా నీవు
బుద్దెఱింగినప్పు డయ్యీ పురుషోత్తమా
అద్దుకొని శ్రీవేంకటాద్రి పురుషోత్తమా నీది
బొద్దువంటి యుంగరము పురుషోత్తమా
(||pallavi||)
pogu pogu maṁta nīvu puruṣhottamā vaṭṭi
būgalu me mĕṟum̐gamā puru‘ṣhottamā
(||pogu||)
pŏlasulāḍagu nīvu puruṣhottamā nī
pŏla jāṇadanālu puruṣhottamā
pulusuvesi nī sĕṁta puruṣhottamā nemu
pulu garasidi miṁta puruṣhottamā
(||pogu||)
pŏḍavāḍi saḍagām̐ḍa puruṣhottamā
pŏḍamĕ nī movinavvu puruṣhottamā
puḍiśhĕm̐ḍe nī siggu puruṣhottamā
pŏḍirāli radulalo puruṣhottamā
(||pogu||)
pŏdduvŏddu kŏtta lela puruṣhottamā nīvu
buddĕṟiṁginappu ḍayyī puruṣhottamā
addugŏni śhrīveṁkaḍādri puruṣhottamā nīdi
bŏdduvaṁṭi yuṁgaramu puruṣhottamā