పొగడించుకొందువు బూమి నిందరిచేతాను
(॥పల్లవి॥)
పొగడించుకొందువు బూమి నిందరిచేతాను
మిగులాఁ బొరుగువారి మెప్పించరాదా
(॥పొగ॥)
కప్పురమే చల్లీని కన్నులనే మొక్కీని
చెప్పరాని సేవలెల్లఁ జేసీఁ జెలి
యెప్పుడు మన్నించేవు యేది నీ జాణతనము
ముప్పిరిఁ జూచేవారిని మెప్పించరాదా
(॥పొగ॥)
మాటలఁ బ్రియాలు చెప్పీ మచ్చికలఁ గొసరీని
నాటుకొన సారె సారె నవ్వీఁ జెలి
కూటమెప్పు డొసగేవు గుణమెన్నఁడు చూపేవు
మేటి నీదేవుళ్ళను మెప్పించరాదా
(॥పొగ॥)
చన్నుగుత్తులఁ బూజించీ చవిచూపీ మోవితేనె
వున్నతి శ్రీవేంకటేశ వొరసీఁ జెలి
వన్నె యెప్పుడు సేసేవు వలచినగుఱుతేదీ
మిన్న కేలితివాకెనే మెప్పించరాదా
(||pallavi||)
pŏgaḍiṁchugŏṁduvu būmi niṁdarisedānu
migulām̐ bŏruguvāri mĕppiṁcharādā
(||pŏga||)
kappurame sallīni kannulane mŏkkīni
sĕpparāni sevalĕllam̐ jesīm̐ jĕli
yĕppuḍu manniṁchevu yedi nī jāṇadanamu
muppirim̐ jūsevārini mĕppiṁcharādā
(||pŏga||)
māḍalam̐ briyālu sĕppī machchigalam̐ gŏsarīni
nāḍugŏna sārĕ sārĕ navvīm̐ jĕli
kūḍamĕppu ḍŏsagevu guṇamĕnnam̐ḍu sūbevu
meḍi nīdevuḽḽanu mĕppiṁcharādā
(||pŏga||)
sannuguttulam̐ būjiṁchī savisūbī movidenĕ
vunnadi śhrīveṁkaḍeśha vŏrasīm̐ jĕli
vannĕ yĕppuḍu sesevu valasinaguṟudedī
minna kelidivāgĕne mĕppiṁcharādā