Pogadevu nannunu poomsiboomsi palumaaru

పొగడేవు నన్నును పూఁచిపూఁచి పలుమారు
Language

(॥పల్లవి॥)
పొగడేవు నన్నును పూఁచిపూఁచి పలుమారు
యెగసక్కెములకైతే యేమిబాఁతి నేను

(॥పొగ॥)
వలపు చవిగొంటేను వడిఁ జెప్పరానితీపు
బలిమి నొల్లకుంటేను బాఁతిగాదు
పిలిచి విడెమియ్యఁగాఁ బ్రియురాల నైతివి
యెలమి వింతకతొల్లి యేమి బాఁతి నేను

(॥పొగ॥)
రతివేడుక గలితే రసము లొలుతుచుండు
ఇతవుగాక వుండితే యెందూఁ బొందదు
తతిసరసమాడఁగా తగుచనవరినైతి
ఇతరకాంతలలోన యేమిబాఁతి నేను

(॥పొగ॥)
కాఁపురముసేసేనంటే కల్పవృక్షమై తోఁచు
వోపనంటే మొఁటుపడివుండు నూరకే
యేపున శ్రీవేంకటేశ యేలఁగా ఇల్లాలనైతి
యీపై చమ్మటూరఁ జూపే వేమిబాఁతి నేను

(||pallavi||)
pŏgaḍevu nannunu pūm̐sibūm̐si palumāru
yĕgasakkĕmulagaide yemibām̐ti nenu

(||pŏga||)
valabu savigŏṁṭenu vaḍim̐ jĕpparānidību
balimi nŏllaguṁṭenu bām̐tigādu
pilisi viḍĕmiyyam̐gām̐ briyurāla naidivi
yĕlami viṁtagadŏlli yemi bām̐ti nenu

(||pŏga||)
radiveḍuga galide rasamu lŏludusuṁḍu
idavugāga vuṁḍide yĕṁdūm̐ bŏṁdadu
tadisarasamāḍam̐gā tagusanavarinaidi
idaragāṁtalalona yemibām̐ti nenu

(||pŏga||)
kām̐puramusesenaṁṭe kalbavṛkṣhamai tom̐su
vobanaṁṭe mŏm̐ṭubaḍivuṁḍu nūrage
yebuna śhrīveṁkaḍeśha yelam̐gā illālanaidi
yībai sammaḍūram̐ jūbe vemibām̐ti nenu