పొదిగి మమ్ము రేఁచక పో పో నీవు
(॥పల్లవి॥)
పొదిగి మమ్ము రేఁచక పో పో నీవు
పొదరు లాడక నీవు పో పో నీవు
(॥పొదిగి॥)
గద్దరి నీ మాఁటలకు కడ మొదలే లేదు
పొద్దు వోయ నలసితి పో పో నీవు
అద్దలించి నన్నే నీవు ఆన వెట్ట వచ్చేవు
బుద్దు లంత నేరవు పో పో నీవు
(॥పొదిగి॥)
కడ నున్న యాఁడువారి కాలు దొక్క వచ్చేవు
పొడవులు చూపక పో పో నీవు
విడు విడు నీ సుద్ది వింతలా మా కేమి నీవు
పుడకక మమ్మంత పో పో నీవు
(॥పొదిగి॥)
కెరలించ కంత మమ్ము కేరి నీగుట్టే చాలు
పొరుగువారు నవ్వేరు పో పో నీవు
గరిమ శ్రీవెంకటాద్రి కడపరాయఁడ నన్ను
పురిగొనఁ గూడితివి పో పో నీవు
(||pallavi||)
pŏdigi mammu rem̐saga po po nīvu
pŏdaru lāḍaga nīvu po po nīvu
(||pŏdigi||)
gaddari nī mām̐ṭalagu kaḍa mŏdale ledu
pŏddu voya nalasidi po po nīvu
addaliṁchi nanne nīvu āna vĕṭṭa vachchevu
buddu laṁta neravu po po nīvu
(||pŏdigi||)
kaḍa nunna yām̐ḍuvāri kālu dŏkka vachchevu
pŏḍavulu sūbaga po po nīvu
viḍu viḍu nī suddi viṁtalā mā kemi nīvu
puḍagaka mammaṁta po po nīvu
(||pŏdigi||)
kĕraliṁcha kaṁta mammu keri nīguṭṭe sālu
pŏruguvāru navveru po po nīvu
garima śhrīvĕṁkaḍādri kaḍabarāyam̐ḍa nannu
purigŏnam̐ gūḍidivi po po nīvu