పోటి చెలికత్తెఁ గాక పూఁచుక నే మాఁటాడితి
(॥పల్లవి॥)
పోటి చెలికత్తెఁ గాక పూఁచుక నే మాఁటాడితి
ఆఁటది గోలయైతే నట్టే వొత్తుదురా
(॥పోటి॥)
కొచ్చికొచ్చి చన్నుపై కొంగు జారఁదీసి తీసి
తచ్చన మాఁటలఁ గళ దాఁకించేవు
యిచ్చగించి నీచేఁతల కిట్టె వోరుచుకుండితే
పచ్చిసేసి సిగ్గు లింతబాయట వేతురా
(॥పోటి॥)
చేరిచేరి చెంపలపై చెమటలు గోరఁజిమ్మి
జీరదీసి వలపులు చిమ్మిరేఁచేవు
నీరువలెఁ గరఁగుతా నిలుచున్న దాని నీవు
వారివీరిముందరను వట్టిరట్టు సేతురా
(॥పోటి॥)
చెప్పిచెప్పి కాఁగిలించి జిగిమోవి చవిచూపి
చొప్పుగాఁ గూడి కడుఁ జొక్కించేవు
యిప్పుడె శ్రీవేంకటేశ యిల్లాలయినదాని
అప్పసమై రతి నింతయలయింతురా
(||pallavi||)
poḍi sĕligattĕm̐ gāga pūm̐suga ne mām̐ṭāḍidi
ām̐ṭadi golayaide naṭṭe vŏttudurā
(||poḍi||)
kŏchchigŏchchi sannubai kŏṁgu jāram̐dīsi tīsi
tachchana mām̐ṭalam̐ gaḽa dām̐kiṁchevu
yichchagiṁchi nīsem̐tala kiṭṭĕ vorusuguṁḍide
pachchisesi siggu liṁtabāyaḍa vedurā
(||poḍi||)
seriseri sĕṁpalabai sĕmaḍalu goram̐jimmi
jīradīsi valabulu simmirem̐sevu
nīruvalĕm̐ garam̐gudā nilusunna dāni nīvu
vārivīrimuṁdaranu vaṭṭiraṭṭu sedurā
(||poḍi||)
sĕppisĕppi kām̐giliṁchi jigimovi savisūbi
sŏppugām̐ gūḍi kaḍum̐ jŏkkiṁchevu
yippuḍĕ śhrīveṁkaḍeśha yillālayinadāni
appasamai radi niṁtayalayiṁturā