Podduvonivaaru gaaga pore meeru

పొద్దువోనివారు గాక పోరే మీరు
Language

(॥పల్లవి॥)
పొద్దువోనివారు గాక పోరే మీరు
యిద్దరముఁ గూడినపు డీడకు రాఁగదరే

(॥పొద్దు॥)
చింతతోడినన్ను మీరు చేతులేల పట్టేరే
అంతేబత్తి గలిగితేనాతఁడే రాఁడా
కాంతలు మీరు మాపుదాఁకా నాతోఁ బెనఁగితే-
నింతలో మా మనసులకింపు వుట్టీనా

(॥పొద్దు॥)
అలిగివుండిన నన్ను నాడకేల పిలిచేరే
తలఁపు గలిగితేను తానే రాఁడా
చెలు లిందరును గూడి సేసలు నూపైఁ జల్లితే
వలపులు మాలోను వన్నె కెక్కీనా

(॥పొద్దు॥)
సిగ్గుపడి వున్న నన్ను శిరనేల యెత్తేరే
దగ్గరున్నాఁ డంతెయైతే తానే రాఁడా
అగ్గమై శ్రీవేంకటేశుఁడందుకే నన్నుఁ గూడె
వెగ్గళించి యేమన్నా వేరయ్యేమా

(||pallavi||)
pŏdduvonivāru gāga pore mīru
yiddaramum̐ gūḍinabu ḍīḍagu rām̐gadare

(||pŏddu||)
siṁtadoḍinannu mīru sedulela paṭṭere
aṁtebatti galigidenādam̐ḍe rām̐ḍā
kāṁtalu mīru mābudām̐kā nādom̐ bĕnam̐gide-
niṁtalo mā manasulagiṁpu vuṭṭīnā

(||pŏddu||)
aligivuṁḍina nannu nāḍagela pilisere
talam̐pu galigidenu tāne rām̐ḍā
sĕlu liṁdarunu gūḍi sesalu nūbaim̐ jallide
valabulu mālonu vannĕ kĕkkīnā

(||pŏddu||)
siggubaḍi vunna nannu śhiranela yĕttere
daggarunnām̐ ḍaṁtĕyaide tāne rām̐ḍā
aggamai śhrīveṁkaḍeśhum̐ḍaṁduge nannum̐ gūḍĕ
vĕggaḽiṁchi yemannā verayyemā