పొద్దువోనివాఁడవు బొమ్మల జంకించేవు
(॥పల్లవి॥)
పొద్దువోనివాఁడవు బొమ్మల జంకించేవు
వుద్దండాలకెల్ల నీవే వోరుతువు గాక
(॥పొద్దు॥)
చనవు గల కాంతలు జడుతురా యెందుకైన
చెనకి పతిని రట్టుసేతురు గాక
పనిమాలిన తప్పులు పట్టుదురా నీ వందుకు
ననుపులు సేసుకొని నవ్వుదురు గాక
(॥పొద్దు॥)
వింతలేని మగువలు వెరతురా యేమైన
అంతంత నాయములు సోఁకింతురు గాక
పంతము లీపెతోనే యెంతురా నీ వందుకు
యెంతసేసినాను మన్నింతురు గాక
(॥పొద్దు॥)
కూడినట్టి వనితలు కొంకుదురా యెప్పుడైన
వోడక కాఁగిటిలోనే వుందురు గాక
యీడుగా శ్రీవేంకటేశ యేలితివి నీ వందుకు
యేడనైనా యిట్లనే యీడేర్తురు గాక
(||pallavi||)
pŏdduvonivām̐ḍavu bŏmmala jaṁkiṁchevu
vuddaṁḍālagĕlla nīve voruduvu gāga
(||pŏddu||)
sanavu gala kāṁtalu jaḍudurā yĕṁdugaina
sĕnagi padini raṭṭuseduru gāga
panimālina tappulu paṭṭudurā nī vaṁdugu
nanubulu sesugŏni navvuduru gāga
(||pŏddu||)
viṁtaleni maguvalu vĕradurā yemaina
aṁtaṁta nāyamulu som̐kiṁturu gāga
paṁtamu lībĕdone yĕṁturā nī vaṁdugu
yĕṁtasesinānu manniṁturu gāga
(||pŏddu||)
kūḍinaṭṭi vanidalu kŏṁkudurā yĕppuḍaina
voḍaga kām̐giḍilone vuṁduru gāga
yīḍugā śhrīveṁkaḍeśha yelidivi nī vaṁdugu
yeḍanainā yiṭlane yīḍerduru gāga