Podduvonivaamdavu bomkevugaaga

పొద్దువోనివాఁడవు బొంకేవుగాక
Language

(॥పల్లవి॥)
పొద్దువోనివాఁడవు బొంకేవుగాక
వుద్దండపు నీ గుణాలు వొద్దికలయ్యీనా

(॥పొద్దు॥)
మొగమెంత చూచినాను మొక్కులెన్ని మొక్కినాను
చిగిరించినవలపు చేఁగలెక్కీనా
నగవెంత నగినాను వయసెంత చూపినాను
పొగరులనీమాటలు పొసఁగివుండీనా

(॥పొద్దు॥)
తీపు లెంతవుట్టించినా తిద్దీని వంకలాడినా
పూపనియాసలు నేఁడు పుల్లటొరలా
వోపి యంతవోరిచినా వూడిగ మెంతసేసినా
నీపఱచుఁజేఁతలు నేడు చక్కనవునా

(॥పొద్దు॥)
మనసెంత గరఁచినాను మచ్చికెంత రేఁచినాను
పెనఁగొన్నరతు లిఁక బీరుపోయినా
ననిచి శ్రీవేంకటేశ నన్ను నిట్టె కూడితివి
వినవయ్య నీమన్నవ వేరొకటయ్యీనా

(||pallavi||)
pŏdduvonivām̐ḍavu bŏṁkevugāga
vuddaṁḍabu nī guṇālu vŏddigalayyīnā

(||pŏddu||)
mŏgamĕṁta sūsinānu mŏkkulĕnni mŏkkinānu
sigiriṁchinavalabu sem̐galĕkkīnā
nagavĕṁta naginānu vayasĕṁta sūbinānu
pŏgarulanīmāḍalu pŏsam̐givuṁḍīnā

(||pŏddu||)
tību lĕṁtavuṭṭiṁchinā tiddīni vaṁkalāḍinā
pūbaniyāsalu nem̐ḍu pullaḍŏralā
vobi yaṁtavorisinā vūḍiga mĕṁtasesinā
nībaṟasum̐jem̐talu neḍu sakkanavunā

(||pŏddu||)
manasĕṁta garam̐sinānu machchigĕṁta rem̐sinānu
pĕnam̐gŏnnaradu lim̐ka bīruboyinā
nanisi śhrīveṁkaḍeśha nannu niṭṭĕ kūḍidivi
vinavayya nīmannava verŏgaḍayyīnā