Podduvoni vibhunigi buddulu seppare meeru

పొద్దువోని విభునికి బుద్దులు చెప్పరే మీరు
Language

(॥పల్లవి॥)
పొద్దువోని విభునికి బుద్దులు చెప్పరే మీరు
వొద్దికతోఁ దనునెట్టు వొడఁబరచేనే

(॥పొద్దు॥)
తఱిఁ దనలోని మేలు తానె యెఱుఁగుఁ గాక
యెఱుకలదానివలె నెట్టుచెప్పేనే
కఱకరిఁ బెట్టి నన్నుఁ గమ్మటిఁ జెప్పుమనీని
తఱచైన మొఱఁగులు దైవమే యెఱుఁగునే

(॥పొద్దు॥)
యేల మొక్కి యడిగీని యింపు తానెరుఁగుఁగాక
వేలుపులదానివలె వినిపించేనా
చేలకొంగు వట్టి నన్ను చేఁతలెల్లనడిగీని
ఆలి మగనిసుద్దులు అతనుఁ డెరుఁగునే

(॥పొద్దు॥)
మొగమేమి చూచీని ముందు తానెరుఁగుఁగాక
సగినాలదానివలె సారెననేనా
అగపడి నన్నుఁ గూడె అలమేల్మంగను నేను
తగు శ్రీవేంకటేశుఁడు తానె యెఱుఁగునే

(||pallavi||)
pŏdduvoni vibhunigi buddulu sĕppare mīru
vŏddigadom̐ danunĕṭṭu vŏḍam̐barasene

(||pŏddu||)
taṟim̐ danaloni melu tānĕ yĕṟum̐gum̐ gāga
yĕṟugaladānivalĕ nĕṭṭusĕppene
kaṟagarim̐ bĕṭṭi nannum̐ gammaḍim̐ jĕppumanīni
taṟasaina mŏṟam̐gulu daivame yĕṟum̐gune

(||pŏddu||)
yela mŏkki yaḍigīni yiṁpu tānĕrum̐gum̐gāga
velubuladānivalĕ vinibiṁchenā
selagŏṁgu vaṭṭi nannu sem̐talĕllanaḍigīni
āli maganisuddulu adanum̐ ḍĕrum̐gune

(||pŏddu||)
mŏgamemi sūsīni muṁdu tānĕrum̐gum̐gāga
sagināladānivalĕ sārĕnanenā
agabaḍi nannum̐ gūḍĕ alamelmaṁganu nenu
tagu śhrīveṁkaḍeśhum̐ḍu tānĕ yĕṟum̐gune