Podduvoni selulella bommalam gaaduga vetti

పొద్దువోని చెలులెల్ల బొమ్మలఁ గాటుక వెట్టి
Language

(॥పల్లవి॥)
పొద్దువోని చెలులెల్ల బొమ్మలఁ గాటుక వెట్టి-
రద్దము చూచుకో నీవు అదివో తగవు

(॥పొద్దు॥)
నేరుపుగలయమ్మ నిక్కి నిక్కి చూచితేను
వోరుపుగలయమ్మ వొడివట్టితీసీ నిన్ను
యీరీతి నిన్నుఁ దిట్ట యెవ్వరి కేమి గారణ
మారసి వచ్చినవాఁడ వదివో తగవు

(॥పొద్దు॥)
వేడుక నొక్కసతి విందుకుఁ జెప్పితేను
వాడికె గలయాపె వడ్డించె మోవి తేనెలు
ఆడుకో నీకునేల అందగాఁడవు నీవైతే
ఆడనీడఁ జెల్లఁబెట్టే వదివో నీ తగవు

(॥పొద్దు॥)
మనువుకు వచ్చినాపె మంచానకుఁ బిలిచితే
చనవు గలిగినాపె సంగడిఁ గూచుండె నిదె
యెనసితి వొక్కమాటే యిద్దరి శ్రీ వేంకటేశ
అనువాయనన్నిటా నీ కదివో తగవు

(||pallavi||)
pŏdduvoni sĕlulĕlla bŏmmalam̐ gāḍuga vĕṭṭi-
raddamu sūsugo nīvu adivo tagavu

(||pŏddu||)
nerubugalayamma nikki nikki sūsidenu
vorubugalayamma vŏḍivaṭṭidīsī ninnu
yīrīdi ninnum̐ diṭṭa yĕvvari kemi gāraṇa
mārasi vachchinavām̐ḍa vadivo tagavu

(||pŏddu||)
veḍuga nŏkkasadi viṁdugum̐ jĕppidenu
vāḍigĕ galayābĕ vaḍḍiṁchĕ movi tenĕlu
āḍugo nīgunela aṁdagām̐ḍavu nīvaide
āḍanīḍam̐ jĕllam̐bĕṭṭe vadivo nī tagavu

(||pŏddu||)
manuvugu vachchinābĕ maṁchānagum̐ biliside
sanavu galiginābĕ saṁgaḍim̐ gūsuṁḍĕ nidĕ
yĕnasidi vŏkkamāḍe yiddari śhrī veṁkaḍeśha
anuvāyananniḍā nī kadivo tagavu