పొద్దువోని చెలులాల బూటక మేమి సేసేరె
(॥పల్లవి॥)
పొద్దువోని చెలులాల బూటక మేమి సేసేరె
వొద్దికి నాతనిఁ దేరె వొనగూడీ నన్నియు
(॥పొద్దు॥)
యెక్కడలేని చలువ లెన్నైనాఁ గలిగినాను
మక్కువ వెన్నెలవేఁడి మాన్పఁబోయీనా
వెక్కసపుచెలులాడే వేడుకమాట లెన్నైనా
వొక్కకోవిలకూతఁ నుడుపఁబోయినా
(॥పొద్దు॥)
వట్టివేళ్లఁ గట్టి యాలవట్టా లెన్నివిసరినా
తట్టి మలయానిలభూతముఁ జోపీనా
ఇట్టె కేళాకూళిలోన నెంత యీఁదులాడించినా
ముట్టినవిరహపునాములు దించీనా
(॥పొద్దు॥)
బచ్చెనచిత్తరు చూపి పరాకు లెంతసేసినా
అచ్చపుమనసిజుని నడఁచేరటే
ఇచ్చల శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
వచ్చి తీనే నన్నుఁగూడె వారించీనా వలపు
(||pallavi||)
pŏdduvoni sĕlulāla būḍaga memi seserĕ
vŏddigi nādanim̐ derĕ vŏnagūḍī nanniyu
(||pŏddu||)
yĕkkaḍaleni saluva lĕnnainām̐ galiginānu
makkuva vĕnnĕlavem̐ḍi mānpam̐boyīnā
vĕkkasabusĕlulāḍe veḍugamāḍa lĕnnainā
vŏkkagovilagūdam̐ nuḍubam̐boyinā
(||pŏddu||)
vaṭṭiveḽlam̐ gaṭṭi yālavaṭṭā lĕnnivisarinā
taṭṭi malayānilabhūdamum̐ jobīnā
iṭṭĕ keḽāgūḽilona nĕṁta yīm̐dulāḍiṁchinā
muṭṭinavirahabunāmulu diṁchīnā
(||pŏddu||)
bachchĕnasittaru sūbi parāgu lĕṁtasesinā
achchabumanasijuni naḍam̐seraḍe
ichchala śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
vachchi tīne nannum̐gūḍĕ vāriṁchīnā valabu