పొద్దువోని ఆఁటది బొమ్మల కాటుక వెట్టీ
(॥పల్లవి॥)
పొద్దువోని ఆఁటది బొమ్మల కాటుక వెట్టీ
అద్దుక యేమిచూచేవు ఆయనాయ రావయ్య
(॥పొద్దు॥)
వింతవింతచూపులను వెలఁది నిన్నుఁజూచి
దొంతరసిగ్గులతోడఁ దొట్టుకొనీని
జంతవలె నీముందర సారెఁ జేసీ వేసాలు
యెంతలేదు రావయ్య మాయింటికి నీవు
(॥పొద్దు॥)
విరుల నిన్నువేసి వెడయాస నీకుఁ జూపి
తరగిరినవ్వు నవ్వీఁ దనలోననె
యెరవులకతలాఁడి యెన్ని నేరుచుకొన్నది
అరుదందేవేల రావయ్యా లోనికిని
(॥పొద్దు॥)
సంగడినే నిలుచుండి చన్నుల నిన్ను నోరసి
అంగపుఁ జెమటతోడ నానందించీని
సంగతి నే నలమేలుమంగను శ్రీవేంకటేశ
రంగుగాఁ గూడితి విట్టె రావయ్యా కాఁగిటికి
(||pallavi||)
pŏdduvoni ām̐ṭadi bŏmmala kāḍuga vĕṭṭī
adduga yemisūsevu āyanāya rāvayya
(||pŏddu||)
viṁtaviṁtasūbulanu vĕlam̐di ninnum̐jūsi
dŏṁtarasigguladoḍam̐ dŏṭṭugŏnīni
jaṁtavalĕ nīmuṁdara sārĕm̐ jesī vesālu
yĕṁtaledu rāvayya māyiṁṭigi nīvu
(||pŏddu||)
virula ninnuvesi vĕḍayāsa nīgum̐ jūbi
taragirinavvu navvīm̐ danalonanĕ
yĕravulagadalām̐ḍi yĕnni nerusugŏnnadi
arudaṁdevela rāvayyā lonigini
(||pŏddu||)
saṁgaḍine nilusuṁḍi sannula ninnu norasi
aṁgabum̐ jĕmaḍadoḍa nānaṁdiṁchīni
saṁgadi ne nalamelumaṁganu śhrīveṁkaḍeśha
raṁgugām̐ gūḍidi viṭṭĕ rāvayyā kām̐giḍigi