పొద్దువోకలకు తనపొందు సేసితిఁగాక
(॥పల్లవి॥)
పొద్దువోకలకు తనపొందు సేసితిఁగాక
నిద్దపుజాణఁడు దనతో నే నేఁటిదే
(॥పొద్దు॥)
తనువు దనకాఁగిటందు తలఁపు పరవశమందు
యెనసె నిదె నాలోన నేఁటివలుపే
కనుచూపు తనమీఁద కడునాస రతిమీఁద
కొనరంటలాయ నాగుణ మేఁటిదే
(॥పొద్దు॥)
మోవిదనవదనమందు ముచ్చట ముదములయందు
యీవలావలను నా కేఁటివలుపే
వావి దనమానము పై వర్తనలు మోము పై
నావలనఁ గలిగె నానను పేఁటికే
(॥పొద్దు॥)
నగవు దనచేఁతలందు నాలి మేలములందు
యెగువదిగువలునాయ నేఁటివలపే
వగలో శ్రీవేంకటేశ్వరుఁడు దా ననుఁ గూడె
మొగమెదుటఁ దనకు నా మొక్కులేఁటివే
(||pallavi||)
pŏdduvogalagu tanabŏṁdu sesidim̐gāga
niddabujāṇam̐ḍu danado ne nem̐ṭide
(||pŏddu||)
tanuvu danagām̐giḍaṁdu talam̐pu paravaśhamaṁdu
yĕnasĕ nidĕ nālona nem̐ṭivalube
kanusūbu tanamīm̐da kaḍunāsa radimīm̐da
kŏnaraṁṭalāya nāguṇa mem̐ṭide
(||pŏddu||)
movidanavadanamaṁdu muchchaḍa mudamulayaṁdu
yīvalāvalanu nā kem̐ṭivalube
vāvi danamānamu pai vardanalu momu pai
nāvalanam̐ galigĕ nānanu pem̐ṭige
(||pŏddu||)
nagavu danasem̐talaṁdu nāli melamulaṁdu
yĕguvadiguvalunāya nem̐ṭivalabe
vagalo śhrīveṁkaḍeśhvarum̐ḍu dā nanum̐ gūḍĕ
mŏgamĕduḍam̐ danagu nā mŏkkulem̐ṭive