Podduvoga nenu needo poomsi penamgemgaaga

పొద్దువోక నేను నీతో పూఁచి పెనఁగేఁగాక
Language

(॥పల్లవి॥)
పొద్దువోక నేను నీతో పూఁచి పెనఁగేఁగాక
తిద్దుకొంటే నేఁడు నీవు తీరుకు వచ్చేవా

(॥పొద్దు॥)
వున్నమవెన్నెల నెట్టు పోగులు వోయఁగవచ్చు
సన్నలఁ గొండల నెట్టు జరప వచ్చు
కిన్నరకాయల నెట్టు గిలిగింత సేయవచ్చు
నిన్నెంత కరఁగించినా నీవు గరఁగేవా

(॥పొద్దు॥)
తేలించి బయలఁ బందిలి యెట్టు వెట్ట వచ్చు
గాలి ముడియఁగా నెట్టు గట్ట వచ్చును
లోలత సముద్రము లోఁతెట్టు గానఁగవచ్చు
చాలాబుద్ది నే చెప్పితే చాయకు వచ్చేవా

(॥పొద్దు॥)
యిలలోని చింతాకు లెట్టు లెక్కవెట్ట వచ్చు
వలపు గంపలఁ బట్టవచ్చుట యెట్టు
అలమేలుమంగ నేను అన్నిటా శ్రీవేంకటేశ
కలసితి విఁక నీవు కడమ లెంచేవా

(||pallavi||)
pŏdduvoga nenu nīdo pūm̐si pĕnam̐gem̐gāga
tiddugŏṁṭe nem̐ḍu nīvu tīrugu vachchevā

(||pŏddu||)
vunnamavĕnnĕla nĕṭṭu pogulu voyam̐gavachchu
sannalam̐ gŏṁḍala nĕṭṭu jaraba vachchu
kinnaragāyala nĕṭṭu giligiṁta seyavachchu
ninnĕṁta karam̐giṁchinā nīvu garam̐gevā

(||pŏddu||)
teliṁchi bayalam̐ baṁdili yĕṭṭu vĕṭṭa vachchu
gāli muḍiyam̐gā nĕṭṭu gaṭṭa vachchunu
lolada samudramu lom̐tĕṭṭu gānam̐gavachchu
sālābuddi ne sĕppide sāyagu vachchevā

(||pŏddu||)
yilaloni siṁtāgu lĕṭṭu lĕkkavĕṭṭa vachchu
valabu gaṁpalam̐ baṭṭavachchuḍa yĕṭṭu
alamelumaṁga nenu anniḍā śhrīveṁkaḍeśha
kalasidi vim̐ka nīvu kaḍama lĕṁchevā