పొద్దువోక నీవు వట్టి పొందులు సేసేవు గాక
(॥పల్లవి॥)
పొద్దువోక నీవు వట్టి పొందులు సేసేవు గాక
వొద్ద నాపె వుండగాను వొరు లితవయ్యేరా
(॥॥)
చెంగట నేపొద్దు నీకు సేవలు సేసీనాపె
వుంగిటి నెదుట నిలిచున్నది ఆపె
సంగతిగా నవ్వునవ్వి సరసమాడీ నాపె
సింగారపు సతులెల్లాఁ జిత్తానఁ బట్టేరా
(॥॥)
వేడుకతో సారె మోవివిందులు వెట్టీ నాపె
యీడుజోడై నీకు విడేలిచ్చీ నాపె
యేడలేని విన్నపాలు ఇట్టె సేసి నాపె
వాడవారి మీఁద నీకు వలపు వుట్టీనా
(॥॥)
సందుకొని కాఁగిలించి చన్నుల నొత్తీ నాపె
మందె మేళపుటలమేల్మంగే ఆపె
ఇందరిలో శ్రీవేంకటేశ నన్ను నేలితివి
సందిగొందులవారిని సరకు గొనేవా
(||pallavi||)
pŏdduvoga nīvu vaṭṭi pŏṁdulu sesevu gāga
vŏdda nābĕ vuṁḍagānu vŏru lidavayyerā
(||||)
sĕṁgaḍa nebŏddu nīgu sevalu sesīnābĕ
vuṁgiḍi nĕduḍa nilisunnadi ābĕ
saṁgadigā navvunavvi sarasamāḍī nābĕ
siṁgārabu sadulĕllām̐ jittānam̐ baṭṭerā
(||||)
veḍugado sārĕ moviviṁdulu vĕṭṭī nābĕ
yīḍujoḍai nīgu viḍelichchī nābĕ
yeḍaleni vinnabālu iṭṭĕ sesi nābĕ
vāḍavāri mīm̐da nīgu valabu vuṭṭīnā
(||||)
saṁdugŏni kām̐giliṁchi sannula nŏttī nābĕ
maṁdĕ meḽabuḍalamelmaṁge ābĕ
iṁdarilo śhrīveṁkaḍeśha nannu nelidivi
saṁdigŏṁdulavārini saragu gŏnevā