పొద్దువొద్దు కిట్లానే భోగించరయ్యా
(॥పల్లవి॥)
పొద్దువొద్దు కిట్లానే భోగించరయ్యా
ఇద్దరికిఁ గలిగె నేఁ డిదివో సోబనము
(॥పొద్దు॥)
పెంచెపుమీతొడలే పెండ్లిపీఁటలు మీకు
ముంచినసిగ్గులే కడుముత్తేల సేస
పంచలచిమ్ముఁజూపులు పసవులు నలఁచుట
అంచెల మీయిద్దరికి నమరె సోబనము
(॥పొద్దు॥)
పొత్తులమోవితేనెలే బువ్వపుఁబాలకూళ్లు
బత్తి తోడినవ్వులే కప్రపుబాగాలు
హత్తినచెనకులే అలరినవుంకువలు
యెత్తలఁ జూచిన మీకు నెనసె సోబనము
(॥పొద్దు॥)
కందువకాఁగిటిరతి గందాక్షతలు మీకు
విందులసరసములు వీడుదోడులు
యిందునె శ్రీవేంకటేశ యింతి నీవు గూడితివి
సందడితో మెరసె నిచ్చలు మీసోబనము
(||pallavi||)
pŏdduvŏddu kiṭlāne bhogiṁcharayyā
iddarigim̐ galigĕ nem̐ ḍidivo sobanamu
(||pŏddu||)
pĕṁchĕbumīdŏḍale pĕṁḍlibīm̐ṭalu mīgu
muṁchinasiggule kaḍumuttela sesa
paṁchalasimmum̐jūbulu pasavulu nalam̐suḍa
aṁchĕla mīyiddarigi namarĕ sobanamu
(||pŏddu||)
pŏttulamovidenĕle buvvabum̐bālagūḽlu
batti toḍinavvule kaprabubāgālu
hattinasĕnagule alarinavuṁkuvalu
yĕttalam̐ jūsina mīgu nĕnasĕ sobanamu
(||pŏddu||)
kaṁduvagām̐giḍiradi gaṁdākṣhadalu mīgu
viṁdulasarasamulu vīḍudoḍulu
yiṁdunĕ śhrīveṁkaḍeśha yiṁti nīvu gūḍidivi
saṁdaḍido mĕrasĕ nichchalu mīsobanamu