పొద్దువో దిదొక కత పూఁచి యానతియ్యవయ్య
(॥పల్లవి॥)
పొద్దువో దిదొక కత పూఁచి యానతియ్యవయ్య
గద్దరి నీ చేఁతలకు కాదు గూడదనను
(॥పొద్దు॥)
కాంతఁ జూచి వచ్చితివా కన్నులారాను
మంతనాన నోరారా మాఁటాడితివా
సంతోసించి యాపె సరసము లాడెనా
వింతలెల్లాఁ జెప్పవయ్యా వినే నేను
(॥పొద్దు॥)
చుట్టమవై వచ్చితివా సుదతికిని
నెట్టన నీ కాఁగిట నించుకొంటివా
అట్టె విందులు నీకు నాపె వెట్టెనా
నెట్టుకొని చెప్పవయ్యా నిన్ను మెచ్చేను
(॥పొద్దు॥)
కాలుదొక్కి వచ్చితివా కలకంటిని
మేలువాఁడ వైతివా మిక్కిలి నీవు
యీలీల శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి
ఆలిసుద్ద చెప్పవయ్యా అడిగేను నిన్ను
(||pallavi||)
pŏdduvo didŏga kada pūm̐si yānadiyyavayya
gaddari nī sem̐talagu kādu gūḍadananu
(||pŏddu||)
kāṁtam̐ jūsi vachchidivā kannulārānu
maṁtanāna norārā mām̐ṭāḍidivā
saṁtosiṁchi yābĕ sarasamu lāḍĕnā
viṁtalĕllām̐ jĕppavayyā vine nenu
(||pŏddu||)
suṭṭamavai vachchidivā sudadigini
nĕṭṭana nī kām̐giḍa niṁchugŏṁṭivā
aṭṭĕ viṁdulu nīgu nābĕ vĕṭṭĕnā
nĕṭṭugŏni sĕppavayyā ninnu mĕchchenu
(||pŏddu||)
kāludŏkki vachchidivā kalagaṁṭini
meluvām̐ḍa vaidivā mikkili nīvu
yīlīla śhrīveṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
ālisudda sĕppavayyā aḍigenu ninnu