పొద్దు వోక నిన్ను నింతా పొదిగేఁగాక
(॥పల్లవి॥)
పొద్దు వోక నిన్ను నింతా పొదిగేఁగాక
చద్దికి వేఁడికి నీతో సాదించవచ్చేనా
(॥పొద్దు॥)
వొత్తి నీకు విన్నవించి వోడఁబరచితిఁబో నీ-
చిత్తములోలేనిమేలు సేసిపట్టేనా
హత్తుకుండుమని నాపై నాన వెట్టించు కొంటిఁబో
బత్తి గొటానఁ బెట్టితే పాదుపడీనా
(॥పొద్దు॥)
ఆఁగిపట్టి పానుపుపై నలమి నిలిపతిఁబో
కాఁగిటలేనిననుపు గడియించేనా
చేఁగదేర నిన్ను బాససేయించుకొంటిఁబో
దాఁగి నీవు రాకుండితేఁ దప్పుగొనేనా
(॥పొద్దు॥)
యెడయక రతుల నిన్నేసితిఁబో నేఁడు
అడియాసతమకాన కడ్డగించేనా
బడినే శ్రీవేంకటేశ పాయలే మిద్దరమును
కడకూ నీచిత్త మింతే కడకట్టేనా
(||pallavi||)
pŏddu voga ninnu niṁtā pŏdigem̐gāga
saddigi vem̐ḍigi nīdo sādiṁchavachchenā
(||pŏddu||)
vŏtti nīgu vinnaviṁchi voḍam̐barasidim̐bo nī-
sittamulolenimelu sesibaṭṭenā
hattuguṁḍumani nābai nāna vĕṭṭiṁchu kŏṁṭim̐bo
batti gŏḍānam̐ bĕṭṭide pādubaḍīnā
(||pŏddu||)
ām̐gibaṭṭi pānububai nalami nilibadim̐bo
kām̐giḍaleninanubu gaḍiyiṁchenā
sem̐gadera ninnu bāsaseyiṁchugŏṁṭim̐bo
dām̐gi nīvu rāguṁḍidem̐ dappugŏnenā
(||pŏddu||)
yĕḍayaga radula ninnesidim̐bo nem̐ḍu
aḍiyāsadamagāna kaḍḍagiṁchenā
baḍine śhrīveṁkaḍeśha pāyale middaramunu
kaḍagū nīsitta miṁte kaḍagaṭṭenā