Poddu voga neegunitte buddulu seppidim gaaga

పొద్దు వోక నీకునిట్టే బుద్దులు చెప్పితిఁ గాక
Language

(॥పల్లవి॥)
పొద్దు వోక నీకునిట్టే బుద్దులు చెప్పితిఁ గాక
చద్దిగట్టితే వలపు చవులవునా

(॥॥)
చెప్పరాని ప్రియములు చెప్పి నీకు వేసరితి
యెప్పుడు నీవోజలివి యేల మానును
తప్పకు బాసలనుచు దండములు వెట్టితిని
చిప్పులి నీవుద్దండాలు సేయక మానితివా

(॥॥)
ఆడేవారి మాటలకు నడ్డమాడి వేసరితి
యేడనుండా నీవె కావా యెంచనేఁటికి
వీడెము చేతికిచ్చి వేఁడుకొంటి చెక్కునొక్కి
కూడేటి సతుల పైకొసరు మానితివా

(॥॥)
తగిలి కాఁగిట నిన్నుఁ దనియించి వేసరితి
యెగసక్కేలకుఁ గాదా యియ్యకొంటివి
నగుతా శ్రీవేంకటేశ ననుపులు మెరసితి
మొగమోట సన్నలు ముందే మానితివా

(||pallavi||)
pŏddu voga nīguniṭṭe buddulu sĕppidim̐ gāga
saddigaṭṭide valabu savulavunā

(||||)
sĕpparāni priyamulu sĕppi nīgu vesaridi
yĕppuḍu nīvojalivi yela mānunu
tappagu bāsalanusu daṁḍamulu vĕṭṭidini
sippuli nīvuddaṁḍālu seyaga mānidivā

(||||)
āḍevāri māḍalagu naḍḍamāḍi vesaridi
yeḍanuṁḍā nīvĕ kāvā yĕṁchanem̐ṭigi
vīḍĕmu sedigichchi vem̐ḍugŏṁṭi sĕkkunŏkki
kūḍeḍi sadula paigŏsaru mānidivā

(||||)
tagili kām̐giḍa ninnum̐ daniyiṁchi vesaridi
yĕgasakkelagum̐ gādā yiyyagŏṁṭivi
nagudā śhrīveṁkaḍeśha nanubulu mĕrasidi
mŏgamoḍa sannalu muṁde mānidivā