పొద్దు వోదా తన కేమి పోరు వెట్టి వేగి లేచి
(॥పల్లవి॥)
పొద్దు వోదా తన కేమి పోరు వెట్టి వేగి లేచి
ఉద్దండీఁడు తన కేమి వూరకుండఁ బట్టదా
(॥పొద్దు॥)
యెప్పటి కుత్తర మిచ్చే దప్పుడే యిచ్చేఁ గాక
యిప్పటినుండియు మాట లేలే నాకు
కప్పి నిజ మాడు మంటా కమ్మర నానవెట్టిని
తప్పు లౌతా వొప్పు లౌతా నెరఁగఁడా
(॥పొద్దు॥)
చేయవలసినప్పుడే చేయి ముంచి చేసేఁ గాక
యీ యెడ నుండియు బంతా లేలే నాకు
ఆయ మంటి వేగిరించి నప్పుడె తనకుఁ దానే
కా యౌతా పండౌతాఁ గనీఁ గాకా
(॥పొద్దు॥)
దగ్గరితి మిద్దరము తరవాయి వచ్చీఁ గాక
యెగ్గులు నెమ్ములుఁ బట్ట నేలే నాకు
బగ్గన శ్రీవెంకటాద్రిపతి నన్నుఁ గూడె నిఁక
ముగ్గుపిండి అట్లకు మొద లయ్యీనా
(||pallavi||)
pŏddu vodā tana kemi poru vĕṭṭi vegi lesi
uddaṁḍīm̐ḍu tana kemi vūraguṁḍam̐ baṭṭadā
(||pŏddu||)
yĕppaḍi kuttara michche dappuḍe yichchem̐ gāga
yippaḍinuṁḍiyu māḍa lele nāgu
kappi nija māḍu maṁṭā kammara nānavĕṭṭini
tappu laudā vŏppu laudā nĕram̐gam̐ḍā
(||pŏddu||)
seyavalasinappuḍe seyi muṁchi sesem̐ gāga
yī yĕḍa nuṁḍiyu baṁtā lele nāgu
āya maṁṭi vegiriṁchi nappuḍĕ tanagum̐ dāne
kā yaudā paṁḍaudām̐ ganīm̐ gāgā
(||pŏddu||)
daggaridi middaramu taravāyi vachchīm̐ gāga
yĕggulu nĕmmulum̐ baṭṭa nele nāgu
baggana śhrīvĕṁkaḍādribadi nannum̐ gūḍĕ nim̐ka
muggubiṁḍi aṭlagu mŏda layyīnā