పొద్దు గూకుఁ దెల్లవారు పురుషుని చిత్త మింతె
(॥పల్లవి॥)
పొద్దు గూకుఁ దెల్లవారు పురుషుని చిత్త మింతె
వొద్దివారే యిట్లైతే వోరువ నేఁ గలనా
(॥పొద్దు॥)
తగులుగలుగువాఁడు తానే రాకమానీనా
అగడు సేసి పిలువ నంత యేఁటికే
మొగము చూచితేఁ జాలు మొక్కక నే మానేనా
యెగసక్కే లిఁక నాతో నేమీ నాడకురే
(॥పొద్దు॥)
తప్పక చూచినవాఁడు దయవెట్టి కుండీనా
చెప్పరానివిన్నపాలు సేయ నేఁటికే
ముప్పిరి నవ్వితేఁజాలు మచ్చటాడక మానేనా
ఇప్పు డేమికొపము నాయెదుటఁ జూపకురే
(॥పొద్దు॥)
మంచమెక్కినవాఁడు మరి కూడక మానీనా
కొంచక శ్రీవేంకటేశుఁ గొసర నేలే
ముంచి యాతఁడే కలసె మొరఁగి నేఁ గాదనేనా
అంచలఁ దొల్లిటిసుద్దు లవి దడవకురే
(||pallavi||)
pŏddu gūgum̐ dĕllavāru puruṣhuni sitta miṁtĕ
vŏddivāre yiṭlaide voruva nem̐ galanā
(||pŏddu||)
tagulugaluguvām̐ḍu tāne rāgamānīnā
agaḍu sesi piluva naṁta yem̐ṭige
mŏgamu sūsidem̐ jālu mŏkkaga ne mānenā
yĕgasakke lim̐ka nādo nemī nāḍagure
(||pŏddu||)
tappaga sūsinavām̐ḍu dayavĕṭṭi kuṁḍīnā
sĕpparānivinnabālu seya nem̐ṭige
muppiri navvidem̐jālu machchaḍāḍaga mānenā
ippu ḍemigŏbamu nāyĕduḍam̐ jūbagure
(||pŏddu||)
maṁchamĕkkinavām̐ḍu mari kūḍaga mānīnā
kŏṁchaga śhrīveṁkaḍeśhum̐ gŏsara nele
muṁchi yādam̐ḍe kalasĕ mŏram̐gi nem̐ gādanenā
aṁchalam̐ dŏlliḍisuddu lavi daḍavagure