పొద్దొకచాయలవాఁడు పురుషోత్తముఁ డితఁడు
(॥పల్లవి॥)
పొద్దొకచాయలవాఁడు పురుషోత్తముఁ డితఁడు
కొద్దిలేని మెఱుఁగులే కుప్పయైన ట్టాయనూ
(॥పొద్దొక॥)
చక్కని దేవుఁ డదే జంకములాడఁ గాను
వెక్కసపు తిరుమేన వెల్లులాయను
చొక్కపు గోపికలెల్లాఁ జూచినతేటలమాపు
తక్కక యీతనిమేన దై వారిన ట్టాయ
(॥పొద్దొక॥)
కప్పురకాపుమేనఁ గడు నిండా మెత్తుకోఁగా
నెప్పున వెన్నెలవన్నె నిండుకొనెను
అప్పటి బదారువేలు అందరును నవ్వఁగాను
ముప్పిరి నీతని మేన ముంచినయ ట్టాయను
(॥పొద్దొక॥)
చెలఁగి పుళుగుకాపు శ్రీవేంకటేశుఁడు వూసి
పలురత్నాలసొమ్ములఁ బరగీని
అలమేలుమంగకొప్పునందలినీల వర్ణము
యెలమిఁ దిరుమేనను యిరవైన ట్టాయ
(||pallavi||)
pŏddŏgasāyalavām̐ḍu puruṣhottamum̐ ḍidam̐ḍu
kŏddileni mĕṟum̐gule kuppayaina ṭṭāyanū
(||pŏddŏga||)
sakkani devum̐ ḍade jaṁkamulāḍam̐ gānu
vĕkkasabu tirumena vĕllulāyanu
sŏkkabu gobigalĕllām̐ jūsinadeḍalamābu
takkaga yīdanimena dai vārina ṭṭāya
(||pŏddŏga||)
kappuragābumenam̐ gaḍu niṁḍā mĕttugom̐gā
nĕppuna vĕnnĕlavannĕ niṁḍugŏnĕnu
appaḍi badāruvelu aṁdarunu navvam̐gānu
muppiri nīdani mena muṁchinaya ṭṭāyanu
(||pŏddŏga||)
sĕlam̐gi puḽugugābu śhrīveṁkaḍeśhum̐ḍu vūsi
paluratnālasŏmmulam̐ baragīni
alamelumaṁgagŏppunaṁdalinīla varṇamu
yĕlamim̐ dirumenanu yiravaina ṭṭāya