పొద్దొక వన్నెలతోడఁ బొదలీ నీపె సిరులు
(॥పల్లవి॥)
పొద్దొక వన్నెలతోడఁ బొదలీ నీపె సిరులు
వొద్దికతోఁ జూడరమ్మా వూహించి చెలులు
(॥పొద్దొక॥)
చెలి చెక్కులఁ గాసేవి చిరునవ్వు వెన్నెలలు
పలుకులఁ దొలఁకేవి పంచదారలు
పలువరుసనుఁ గనుపట్టినవి మాణికాలు
యిల నీకె చక్యఁదనన మెంతని చెప్పుదమే
(॥పొద్దొక॥)
చన్నులపైఁ దేరేవి చాయల పైఁడినిగ్గులు
కన్ను లజళిపించెవి కారుమించులు
చిన్ని మొగమున మెరసేవి మదనకళలు
యిన్నిటా నీపె భావము యెంతని చెప్పుదమే
(॥పొద్దొక॥)
నిక్కుఁదురుము మీఁదట నిండినవి సింగారాలు
చొక్కపుమేన నిండేవి చక్కఁదనాలు
గక్కన శ్రీవేంకటాద్రి ఘనుఁడు మన్నించి కూడె
యిక్కడ నీపె చెలువ మెంతని చెప్పుదమే
(||pallavi||)
pŏddŏga vannĕladoḍam̐ bŏdalī nībĕ sirulu
vŏddigadom̐ jūḍarammā vūhiṁchi sĕlulu
(||pŏddŏga||)
sĕli sĕkkulam̐ gāsevi sirunavvu vĕnnĕlalu
palugulam̐ dŏlam̐kevi paṁchadāralu
paluvarusanum̐ ganubaṭṭinavi māṇigālu
yila nīgĕ sakyam̐danana mĕṁtani sĕppudame
(||pŏddŏga||)
sannulabaim̐ derevi sāyala paim̐ḍiniggulu
kannu lajaḽibiṁchĕvi kārumiṁchulu
sinni mŏgamuna mĕrasevi madanagaḽalu
yinniḍā nībĕ bhāvamu yĕṁtani sĕppudame
(||pŏddŏga||)
nikkum̐durumu mīm̐daḍa niṁḍinavi siṁgārālu
sŏkkabumena niṁḍevi sakkam̐danālu
gakkana śhrīveṁkaḍādri ghanum̐ḍu manniṁchi kūḍĕ
yikkaḍa nībĕ sĕluva mĕṁtani sĕppudame