పొడగనే నిదె నిన్ను పొలఁతులు వేరె వేరె
(॥పల్లవి॥)
పొడగనే నిదె నిన్ను పొలఁతులు వేరె వేరె
అడియాలా లెత్తించే నే నందరిని నీకును
(॥పొడ॥)
సెలవి నవ్వుల నిన్నుఁ జేతికి లోఁ జేసుకొన్న
కలికివో యీపె నీకుఁ గానుకిచ్చీని
మొలక చన్నులు చూపి మోహింపించె నిన్నీసతి
యెలయించె మాటలనే యీ వనిత
(॥పొడ॥)
మోవితేనె చూపి నీచే మొక్కించుకొన్న దీయింతి
కేవల మెప్పుడు తా సాగిలి మొక్కీని
వావులు చల్లె(ల్లి) నిన్ను వలపించె నీ మగువ
పూవుల వేసి నిన్నుఁ బొందెను యీ తరుణి
(॥పొడ॥)
గక్కనఁ గాఁగిటఁ బట్టి కరఁగించె నన్నీకాంత
చెక్కునొక్కి తానే ముందు సేసఁబెట్టీని
యిక్కువంటి శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
యెక్కుడైతి నిందరిలో నిందువంక నేను
(||pallavi||)
pŏḍagane nidĕ ninnu pŏlam̐tulu verĕ verĕ
aḍiyālā lĕttiṁche ne naṁdarini nīgunu
(||pŏḍa||)
sĕlavi navvula ninnum̐ jedigi lom̐ jesugŏnna
kaligivo yībĕ nīgum̐ gānugichchīni
mŏlaga sannulu sūbi mohiṁpiṁchĕ ninnīsadi
yĕlayiṁchĕ māḍalane yī vanida
(||pŏḍa||)
movidenĕ sūbi nīse mŏkkiṁchugŏnna dīyiṁti
kevala mĕppuḍu tā sāgili mŏkkīni
vāvulu sallĕ(lli) ninnu valabiṁchĕ nī maguva
pūvula vesi ninnum̐ bŏṁdĕnu yī taruṇi
(||pŏḍa||)
gakkanam̐ gām̐giḍam̐ baṭṭi karam̐giṁchĕ nannīgāṁta
sĕkkunŏkki tāne muṁdu sesam̐bĕṭṭīni
yikkuvaṁṭi śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
yĕkkuḍaidi niṁdarilo niṁduvaṁka nenu