Pobo yimkaa nemtigi podduvodaa

పోపో యింకా నేఁటికి పొద్దువోదా
Language

(॥పల్లవి॥)
పోపో యింకా నేఁటికి పొద్దువోదా
పైపై నీకు మొక్కేము పదివేలు వచ్చెను

(॥పోపో॥)
సారె నీవు మోహించినతిమోటలే కాక
వీరి వారివిన్న పాలు విందువా నీవు
కారణము లేక నీతోఁ గతలెల్లాఁ జెప్పి నేను
నేరనై తిఁ గాక అంత నీవు మోసపోదువా

(॥పోపో॥)
యిన్నిటా నిన్ను జంకించేయింతి వాకిలే కాక
కన్న వారివద్ద నెల్ల కాచుకుండేవా
పిన్నతనమున నేనే పెనఁగి వట్టిజోలిని
వున్నదానఁ గాక నీవు వొకరిఁగైకొందువా

(॥పోపో॥)
వూడిగపు చెలితోనే వోరి నవ్వుదువు గాక
యేడోనారితో సరసా లిట్టే యాడేవా
వేడుక శ్రీవేంకటేశ వెస నన్నుఁగూడితివి
యేడా నేనే కాక నీవు యెఱఁగనివాఁడవా

(||pallavi||)
pobo yiṁkā nem̐ṭigi pŏdduvodā
paibai nīgu mŏkkemu padivelu vachchĕnu

(||pobo||)
sārĕ nīvu mohiṁchinadimoḍale kāga
vīri vārivinna pālu viṁduvā nīvu
kāraṇamu lega nīdom̐ gadalĕllām̐ jĕppi nenu
neranai tim̐ gāga aṁta nīvu mosaboduvā

(||pobo||)
yinniḍā ninnu jaṁkiṁcheyiṁti vāgile kāga
kanna vārivadda nĕlla kāsuguṁḍevā
pinnadanamuna nene pĕnam̐gi vaṭṭijolini
vunnadānam̐ gāga nīvu vŏgarim̐gaigŏṁduvā

(||pobo||)
vūḍigabu sĕlidone vori navvuduvu gāga
yeḍonārido sarasā liṭṭe yāḍevā
veḍuga śhrīveṁkaḍeśha vĕsa nannum̐gūḍidivi
yeḍā nene kāga nīvu yĕṟam̐ganivām̐ḍavā