పోపో యిదేడే సుద్ది పొద్దు వోవో
(॥పల్లవి॥)
పోపో యిదేడే సుద్ది పొద్దు వోవో
చేపట్టి యిందుకుఁగా చిన్నఁబోకువయ్యా
(॥పోపో॥)
ఆకసాన నున్నచంద్రు నఱచేతఁ బట్టెఁ గాక
చేకొని చేతికి చెక్కుచేయా ఆది
మై కొని చిలుకలకు మాటలు నేరిపెఁ గాక
నాకు నిష్టూరాన నిన్ను వనిత దూరీనా
(॥పోపో॥)
జక్కవల సేద దీర చల్లఁగా విసరెఁ గాక
వుక్కుఁదమకమున నిట్టూర్పులా అవి
నిక్కిన కలువలకు నిండ నీరు గట్టెఁ గాక
గక్కున సతికి నవి కన్నీటివరదలా
(॥పోపో॥)
వేడుకకు సెలవుల వెన్నెలలు గాసెఁ గాక
జాడల నీతోడి యెకసక్కెమా ఇది
యీడనే శ్రీవేంకటేశ యీకాంతఁ గూడితివి
తోడనే ని న్నాకె మెచ్చె దోసమా యిది
(||pallavi||)
pobo yideḍe suddi pŏddu vovo
sebaṭṭi yiṁdugum̐gā sinnam̐boguvayyā
(||pobo||)
āgasāna nunnasaṁdru naṟasedam̐ baṭṭĕm̐ gāga
segŏni sedigi sĕkkuseyā ādi
mai kŏni silugalagu māḍalu neribĕm̐ gāga
nāgu niṣhṭūrāna ninnu vanida dūrīnā
(||pobo||)
jakkavala seda dīra sallam̐gā visarĕm̐ gāga
vukkum̐damagamuna niṭṭūrbulā avi
nikkina kaluvalagu niṁḍa nīru gaṭṭĕm̐ gāga
gakkuna sadigi navi kannīḍivaradalā
(||pobo||)
veḍugagu sĕlavula vĕnnĕlalu gāsĕm̐ gāga
jāḍala nīdoḍi yĕgasakkĕmā idi
yīḍane śhrīveṁkaḍeśha yīgāṁtam̐ gūḍidivi
toḍane ni nnāgĕ mĕchchĕ dosamā yidi