Pobo yidedasuddi poddunam raamgadave

పోపో యిదేడసుద్ది పొద్దునఁ రాఁగదవే
Language

(॥పల్లవి॥)
పోపో యిదేడసుద్ది పొద్దునఁ రాఁగదవే
యీపాటిదానవు ముందేల పిలిచితివే

(॥పో పో॥)
మంతనము లేమిటికే మారుమాట లేమిటికే
కాంతుఁడు వాకిట వచ్చి కాచుకుండఁగా
యింతులకు మగవానియిచ్చకమే వలెఁగాక
యెంతలేదు నీచలము యేమి గట్టుకొంటివే

(॥పో పో॥)
అలుక లింకేమిటికే అవ్వలిమో మేమిటికే
నలిరేఁగి పతి నీతో నవ్వు నవ్వగా
చెలులకు పతి కట్టె సేవ సేయవలెఁగాక
యెలమి నెగ్గులువట్టే వింతేసి కద్దటవే

(॥పో పో॥)
చెక్కుచేతు లేమిటికే సిగ్గులింకా నేమిటికే
వొక్కటై శ్రీవేంకటేశుఁడొప్పఁ జెప్పఁగా
తప్పక సతికి పతి తగులమే వలెఁగాక
ఇప్పుడే కూడితిరి ఇంకఁ జెప్ప నేఁటికే

(||pallavi||)
pobo yideḍasuddi pŏddunam̐ rām̐gadave
yībāḍidānavu muṁdela pilisidive

(||po po||)
maṁtanamu lemiḍige mārumāḍa lemiḍige
kāṁtum̐ḍu vāgiḍa vachchi kāsuguṁḍam̐gā
yiṁtulagu magavāniyichchagame valĕm̐gāga
yĕṁtaledu nīsalamu yemi gaṭṭugŏṁṭive

(||po po||)
aluga liṁkemiḍige avvalimo memiḍige
nalirem̐gi padi nīdo navvu navvagā
sĕlulagu padi kaṭṭĕ seva seyavalĕm̐gāga
yĕlami nĕgguluvaṭṭe viṁtesi kaddaḍave

(||po po||)
sĕkkusedu lemiḍige sigguliṁkā nemiḍige
vŏkkaḍai śhrīveṁkaḍeśhum̐ḍŏppam̐ jĕppam̐gā
tappaga sadigi padi tagulame valĕm̐gāga
ippuḍe kūḍidiri iṁkam̐ jĕppa nem̐ṭige