పోపో యెందువోయేవో పోయి రారాదా
(॥పల్లవి॥)
పోపో యెందువోయేవో పోయి రారాదా
కోపుల వెనుక నన్నుఁ గూడేవుగాని
(॥పోపో॥)
పక్కన నాతోమాటపలుకు లాడేవుగాని
యెక్కడో పరాకు నీకు నిదెఱఁగనా
చక్కఁజూచి నాతోనే సటలు సేసేవుగాని
చిక్కనినీమతిలోనిచింత వేరేరా
(॥పోపో॥)
యెదురైనవాఁడవై యిటు నిలిచితిగాని
అదన నీతమకము లవి వేరేపో
ముదముల నూరకైన మోవినే నవ్వేవుగాని
కదిసిననీమేనికాఁక వేరేరా
(॥పోపో॥)
కళలు సోఁకఁగ నన్నుఁ గాఁగిలించితివిగాని
తలమోచివచ్చినట్టితమి వేరేపో
యెలమి శ్రీ వేంకటకకేశ యిపు డొక్కటాయఁగాని
కలదాననేని నీకుఁ గడమేది లేదురా
(||pallavi||)
pobo yĕṁduvoyevo poyi rārādā
kobula vĕnuga nannum̐ gūḍevugāni
(||pobo||)
pakkana nādomāḍabalugu lāḍevugāni
yĕkkaḍo parāgu nīgu nidĕṟam̐ganā
sakkam̐jūsi nādone saḍalu sesevugāni
sikkaninīmadilonisiṁta vererā
(||pobo||)
yĕdurainavām̐ḍavai yiḍu nilisidigāni
adana nīdamagamu lavi verebo
mudamula nūragaina movine navvevugāni
kadisinanīmenigām̐ka vererā
(||pobo||)
kaḽalu som̐kam̐ga nannum̐ gām̐giliṁchidivigāni
talamosivachchinaṭṭidami verebo
yĕlami śhrī veṁkaḍagageśha yibu ḍŏkkaḍāyam̐gāni
kaladānaneni nīgum̐ gaḍamedi ledurā