Pobo yekkadisuddi podduvodaa ayya neegu

పోపో యెక్కడిసుద్ది పొద్దువోదా అయ్య నీకు
Language

(॥పల్లవి॥)
పోపో యెక్కడిసుద్ది పొద్దువోదా అయ్య నీకు
యీ పనులు మీకెకాక యిది మాకుఁ దగవా

(॥పోపో॥)
ఆకెతోడ నీవు నన్ను నాడుమన్న మాఁటలెల్ల
యేకతానఁ జెప్పఁబోతే యెట్టుండును
ఆకడనుఁ దనసరియాఁటదానిఁ బేరుకొంటే
యీకడ నీపెకు నేఁడు యితవయ్యీనా

(॥పోపో॥)
వువిదకు నీవంపినవుంగరాలు నే నిపుడు
ఇవలఁ జేతికియ్యఁగ యేమనునో
ఆవల నొక తెపాదలందున్న మెట్టె లిచ్చితే
సవతులైనవారు యీజాడల కోరుతురా

(॥పోపో॥)
ఇంతిఁ బిలువుమనఁగా యీడకు రప్పించితిని
యింతలో గూడె ఇంకెంత యెగ్గువట్టునో
వింతగా శ్రీవేంకటేశ వేరొకతె యింటిలోన
బంతి యీపె వెట్టితే యీపనికి సఇంచునా

(||pallavi||)
pobo yĕkkaḍisuddi pŏdduvodā ayya nīgu
yī panulu mīgĕgāga yidi māgum̐ dagavā

(||pobo||)
āgĕdoḍa nīvu nannu nāḍumanna mām̐ṭalĕlla
yegadānam̐ jĕppam̐bode yĕṭṭuṁḍunu
āgaḍanum̐ danasariyām̐ṭadānim̐ berugŏṁṭe
yīgaḍa nībĕgu nem̐ḍu yidavayyīnā

(||pobo||)
vuvidagu nīvaṁpinavuṁgarālu ne nibuḍu
ivalam̐ jedigiyyam̐ga yemanuno
āvala nŏga tĕbādalaṁdunna mĕṭṭĕ lichchide
savadulainavāru yījāḍala korudurā

(||pobo||)
iṁtim̐ biluvumanam̐gā yīḍagu rappiṁchidini
yiṁtalo gūḍĕ iṁkĕṁta yĕgguvaṭṭuno
viṁtagā śhrīveṁkaḍeśha verŏgadĕ yiṁṭilona
baṁti yībĕ vĕṭṭide yībanigi sa̮iṁchunā