Pobo neegidiyemi podduvodu

పోపో నీకిదియేమి పొద్దువోదు
Language

(॥పల్లవి॥)
పోపో నీకిదియేమి పొద్దువోదు
తీపులు చూపి మమ్ముఁ దియ్యకురా యిఁకను

(॥పోపో॥)
ఒల్లనివాఁడవు మమ్మునూరకేల పిలిచేవు
మల్లాడి మాపైమనసు మరవరాదా
బల్లిదురాలాకెగొన్న బాసదప్పినాఁ దప్పీ
పల్లదాననిఁక నీవు పట్టకురా మమ్మును

(॥పోపో॥)
ఇంటికి రానివాఁడవు యేడనైన నవ్వనేల
వెంటనే మాతో తగులు విడువరాదా
గొంటరై యిందుకునాపె కోపగించినా కోపించీ
అంటి ముట్టి సరసములాడకురా యిఁకను

(॥పోపో॥)
పంతపువాఁడవు మమ్ము పట్టి కౌఁగిలించనేల
అంతయు నాపెనే పోయి అడుగరాదా
చెంతనే శ్రీవెంకటేశ చేకొని నన్నుఁగూడితి
వింతకంటె రతినలయించకురా నీవు

(||pallavi||)
pobo nīgidiyemi pŏdduvodu
tībulu sūbi mammum̐ diyyagurā yim̐kanu

(||pobo||)
ŏllanivām̐ḍavu mammunūragela pilisevu
mallāḍi mābaimanasu maravarādā
ballidurālāgĕgŏnna bāsadappinām̐ dappī
palladānanim̐ka nīvu paṭṭagurā mammunu

(||pobo||)
iṁṭigi rānivām̐ḍavu yeḍanaina navvanela
vĕṁṭane mādo tagulu viḍuvarādā
gŏṁṭarai yiṁdugunābĕ kobagiṁchinā kobiṁchī
aṁṭi muṭṭi sarasamulāḍagurā yim̐kanu

(||pobo||)
paṁtabuvām̐ḍavu mammu paṭṭi kaum̐giliṁchanela
aṁtayu nābĕne poyi aḍugarādā
sĕṁtane śhrīvĕṁkaḍeśha segŏni nannum̐gūḍidi
viṁtagaṁṭĕ radinalayiṁchagurā nīvu