Po po yideda suddi poyinadi vo neeve

పో పో యిదేడ సుద్ది పోయినది వో నీవే
Language

(॥పల్లవి॥)
పో పో యిదేడ సుద్ది పోయినది వో నీవే
రేపు మాపు నిదే పనే రేసు లేల పెంచేవు

(॥పో పో॥)
పంతములే ఆడేవు పట్టేవు చలము
యింతులకుఁ బతిమీఁద నింత గద్దటే
కొంత నీచెక్క నొక్కఁగ గోరు దాఁకె నింతే కాక
అంత నీతోఁ బగ పాడే అతఁడు వో చెలియ

(॥పో పో॥)
పిలిచితేఁ గసరేవు పెనఁగితే విసిగేవు
వలచినయీతనితో వాదు లేఁటికే
బలిమి నిన్నుఁ బట్టఁగ పాపట చెదరెఁ గాక
వలె వలె నని నీతో వాదులకు వచ్చెనా

(॥పో పో॥)
నిట్టూర్పు నించేవు నివ్వెరగుఁ బొందేవు
యిట్టె శ్రీవెంకటెశు నేఁప నేఁటికే
గుట్టుతోఁ గాఁగిలించఁగఁ గొప్పు వీడె నింతె కాక
తొట్టిన రతులోన దొమ్మి సేయ వచ్చెనా

(||pallavi||)
po po yideḍa suddi poyinadi vo nīve
rebu mābu nide pane resu lela pĕṁchevu

(||po po||)
paṁtamule āḍevu paṭṭevu salamu
yiṁtulagum̐ badimīm̐da niṁta gaddaḍe
kŏṁta nīsĕkka nŏkkam̐ga goru dām̐kĕ niṁte kāga
aṁta nīdom̐ baga pāḍe adam̐ḍu vo sĕliya

(||po po||)
pilisidem̐ gasarevu pĕnam̐gide visigevu
valasinayīdanido vādu lem̐ṭige
balimi ninnum̐ baṭṭam̐ga pābaḍa sĕdarĕm̐ gāga
valĕ valĕ nani nīdo vādulagu vachchĕnā

(||po po||)
niṭṭūrbu niṁchevu nivvĕragum̐ bŏṁdevu
yiṭṭĕ śhrīvĕṁkaḍĕśhu nem̐pa nem̐ṭige
guṭṭudom̐ gām̐giliṁcham̐gam̐ gŏppu vīḍĕ niṁtĕ kāga
tŏṭṭina radulona dŏmmi seya vachchĕnā