Po po yideda suddi poddu vodaa tanagu

పో పో యిదేడ సుద్ది పొద్దు వోదా తనకు
Language

(॥పల్లవి॥)
పో పో యిదేడ సుద్ది పొద్దు వోదా తనకు
దూపకు నేయి దాగేటి దూరు గాకా

(॥పో పో॥)
యింతిని వద్దఁ బెట్టుక యేల పిలిచీనె నన్ను
బంతిఁ గట్ట రతు లేమి పసులదొడ్డే
దొంతులవేడుకలను తొల్లె తా మోల లాడిరి
యింతలోనఁ జల్లారిన యీ చ వింతే కాక

(॥పో పో॥)
కమ్మి యాపెపై నొరగి కమ్మటి నన్నేల పట్టీ
కుమ్మి చిందులాడ నేమి గొల్లదోమటే
అమ్మరో తా మిద్దరును అన్నిటాఁ గరఁగి మీఁద
చిమ్ములాన నవ్వితేనె నెల వౌఁగాకా

(॥పో పో॥)
కన్నుల నొక్కతెఁ జూచి కాఁగిట నన్ను బిగించీ
పన్నినవలపు రేమి బండికండ్లా
యిన్నిటా శ్రీవెంకటేశుఁ డిద్దరిఁ దాఁ గూడినాఁడు
మన్నించ నాపెతో సరి మరిగితిఁ గాకా

(||pallavi||)
po po yideḍa suddi pŏddu vodā tanagu
dūbagu neyi dāgeḍi dūru gāgā

(||po po||)
yiṁtini vaddam̐ bĕṭṭuga yela pilisīnĕ nannu
baṁtim̐ gaṭṭa radu lemi pasuladŏḍḍe
dŏṁtulaveḍugalanu tŏllĕ tā mola lāḍiri
yiṁtalonam̐ jallārina yī sa viṁte kāga

(||po po||)
kammi yābĕbai nŏragi kammaḍi nannela paṭṭī
kummi siṁdulāḍa nemi gŏlladomaḍe
ammaro tā middarunu anniḍām̐ garam̐gi mīm̐da
simmulāna navvidenĕ nĕla vaum̐gāgā

(||po po||)
kannula nŏkkadĕm̐ jūsi kām̐giḍa nannu bigiṁchī
panninavalabu remi baṁḍigaṁḍlā
yinniḍā śhrīvĕṁkaḍeśhum̐ ḍiddarim̐ dām̐ gūḍinām̐ḍu
manniṁcha nābĕdo sari marigidim̐ gāgā