పో పో యిదేడ సుద్ది పొద్దు పొద్దు చెలులకు
(॥పల్లవి॥)
పో పో యిదేడ సుద్ది పొద్దు పొద్దు చెలులకు
యేపున నిన్ను రమ్మన నేడదాన నేను
(॥పో పో॥)
కాతరాన నలుకలు గడించేవు గాక నీవు
నీతో నలుక రేఁచ నే మెవ్వరము
జాతులకు నీ వాడెటిచారువాకా లింతే కాక
ఆతల నిన్నుఁ గొసర నంత పొందులా
(॥పో పో॥)
చిన్నఁ బో యుందాన నంటా చెక్కు నొక్కే వింతే కాక
వున్నతి నీముందరను వొచ్చెము గాదా
యిన్నేసి నీ వినయాలు యెగసక్కే లింతే కాక
నన్ను నీవు వేఁడుకోను నంటుదాననా
(॥పో పో॥)
అక్కడ పూర కుందువా ఆనలు వెట్టేవు గాక
యిక్కడ వా దడువ మా కెవ్వ రున్నారు
గక్కన శ్రీవెంకటేశ కలసితి విటు నన్ను
యెక్కువ తక్కువ లిఁక నేల మాకూ
(||pallavi||)
po po yideḍa suddi pŏddu pŏddu sĕlulagu
yebuna ninnu rammana neḍadāna nenu
(||po po||)
kādarāna nalugalu gaḍiṁchevu gāga nīvu
nīdo naluga rem̐sa ne mĕvvaramu
jādulagu nī vāḍĕḍisāruvāgā liṁte kāga
ādala ninnum̐ gŏsara naṁta pŏṁdulā
(||po po||)
sinnam̐ bo yuṁdāna naṁṭā sĕkku nŏkke viṁte kāga
vunnadi nīmuṁdaranu vŏchchĕmu gādā
yinnesi nī vinayālu yĕgasakke liṁte kāga
nannu nīvu vem̐ḍugonu naṁṭudānanā
(||po po||)
akkaḍa pūra kuṁduvā ānalu vĕṭṭevu gāga
yikkaḍa vā daḍuva mā kĕvva runnāru
gakkana śhrīvĕṁkaḍeśha kalasidi viḍu nannu
yĕkkuva takkuva lim̐ka nela māgū