Po po nee pomdu saalu posaga dimka

పో పో నీ పొందు చాలు పొసగ దిఁక
Language

(॥పల్లవి॥)
పో పో నీ పొందు చాలు పొసగ దిఁక
వైపు గా దనుచు నీతో వడిఁ బోరాడేనా

(॥పో పో॥)
అప్పుడే ఆపెమాఁటకు నదలించ వలదా
విప్పుచు నన్నుఁ దిట్టఁగా విందురా నీవు
చెప్ప నేల నీతోడిచెలి మేఁటి చెలిమి
ముప్పిరి చుట్టమ వంటా మొగము చూచేదా

(॥పో పో॥)
మచ్చరాన నవ్వఁ గాను మానుపంగ వలదా
వొచ్చాన నావేళ నా పెవొద్ద నుందురా
యిచ్చకాన నీకు నాకు నేఁటి మొగమోట మింక
వచ్చినదే పదివేలు వాదులాటే చాలును

(॥పో పో॥)
పొత్తునఁ గూచుండితేను పొ మ్మనంగ వలదా
అత్తల సరి నేతురా ఆపెను నన్ను
అత్తిన శ్రీవెంకటేశ అలమేలుమంగ నేను
బత్తితో నన్నుఁ గూడితి పంత మేఁటి పంతమూ

(||pallavi||)
po po nī pŏṁdu sālu pŏsaga dim̐ka
vaibu gā danusu nīdo vaḍim̐ borāḍenā

(||po po||)
appuḍe ābĕmām̐ṭagu nadaliṁcha valadā
vippusu nannum̐ diṭṭam̐gā viṁdurā nīvu
sĕppa nela nīdoḍisĕli mem̐ṭi sĕlimi
muppiri suṭṭama vaṁṭā mŏgamu sūsedā

(||po po||)
machcharāna navvam̐ gānu mānubaṁga valadā
vŏchchāna nāveḽa nā pĕvŏdda nuṁdurā
yichchagāna nīgu nāgu nem̐ṭi mŏgamoḍa miṁka
vachchinade padivelu vādulāḍe sālunu

(||po po||)
pŏttunam̐ gūsuṁḍidenu pŏ mmanaṁga valadā
attala sari nedurā ābĕnu nannu
attina śhrīvĕṁkaḍeśha alamelumaṁga nenu
battido nannum̐ gūḍidi paṁta mem̐ṭi paṁtamū