Pinnalu naa sannulu pisugagu palumaaru

పిన్నలు నా చన్నులు పిసుకకు పలుమారు
Language

(॥పల్లవి॥)
పిన్నలు నా చన్నులు పిసుకకు పలుమారు
వున్నతిఁ బెరిగితేను వోరిచేఁ గాని

(॥పిన్న॥)
నేరుపుగలవారలు నీతో మాటలాడిరి
నేరనిదాన నేను వూరకుందాన
గోరనేల వూఁదేవు కుమ్మెలయ్యీ మే నిట్టె
నేరుపరాదా నీవల్ల నేరిచేఁగాని

(॥పిన్న॥)
రట్టడిసతులెల్లాను జట్టులు సేసిరి నిన్ను
గుట్టుతోడిదానఁగాన కొసరనోప
పట్టకు కుచ్చెల చేత పాసీ పోఁకముడి
గట్టువాయఁ జేయరాదా ఘనమయ్యేఁగాని

(॥పిన్న॥)
నెగ్గళించినచుట్టాలు వెట్టిపనులు గొవిరి
సిగ్గువడ్డదానఁగాన సేవ సేసితి
నిగ్గుల శ్రీవేంకటాద్రినిలయ నన్నేలితివి
తగ్గక మోవియ్యరాదా దప్పిదేరేఁగాని

(||pallavi||)
pinnalu nā sannulu pisugagu palumāru
vunnadim̐ bĕrigidenu vorisem̐ gāni

(||pinna||)
nerubugalavāralu nīdo māḍalāḍiri
neranidāna nenu vūraguṁdāna
goranela vūm̐devu kummĕlayyī me niṭṭĕ
nerubarādā nīvalla nerisem̐gāni

(||pinna||)
raṭṭaḍisadulĕllānu jaṭṭulu sesiri ninnu
guṭṭudoḍidānam̐gāna kŏsaranoba
paṭṭagu kuchchĕla seda pāsī pom̐kamuḍi
gaṭṭuvāyam̐ jeyarādā ghanamayyem̐gāni

(||pinna||)
nĕggaḽiṁchinasuṭṭālu vĕṭṭibanulu gŏviri
sigguvaḍḍadānam̐gāna seva sesidi
niggula śhrīveṁkaḍādrinilaya nannelidivi
taggaga moviyyarādā dappiderem̐gāni