Pinnadanaale sesevu peddaverigi

పిన్నతనాలే సేసేవు పెద్దవెరిగి
Language

(॥పల్లవి॥)
పిన్నతనాలే సేసేవు పెద్దవెరిగి
విన్నపములెల్లాఁ జేసి వేసరితి

(॥పిన్న॥)
యిదివో నీ నిందఁకా నేడ నుంటివయ్యా
వెందకివెదకి నిన్ను వేసరితి
వదలక పసపెటువలె నంటెనయ్యా
కదిసి తోమి తోమి కడిగి వేసరితి

(॥పిన్న॥)
యిటువలె పనులు నీవేమి సేసితివయ్యా
విటతనా లిని చూచి వేసారితి
ఘటన నెవ్వతె నేస్తకాఁడ వైతివయ్యా
అటమటాలెల్లా దిద్ద అప్పుడే వేసరితి

(॥పిన్న॥)
నాడిక నెవ్వతె యలవాటు సేసెనయ్యా
వీడెపుమోవి యిచ్చి వేసారితి
యీడనే శ్రీవేంకటేశ యేలుకొంటి వేనయ్యా
కూడిన నీరతు లెంచికొని నే వేసరితి

(||pallavi||)
pinnadanāle sesevu pĕddavĕrigi
vinnabamulĕllām̐ jesi vesaridi

(||pinna||)
yidivo nī niṁdam̐kā neḍa nuṁṭivayyā
vĕṁdagivĕdagi ninnu vesaridi
vadalaga pasabĕḍuvalĕ naṁṭĕnayyā
kadisi tomi tomi kaḍigi vesaridi

(||pinna||)
yiḍuvalĕ panulu nīvemi sesidivayyā
viḍadanā lini sūsi vesāridi
ghaḍana nĕvvadĕ nestagām̐ḍa vaidivayyā
aḍamaḍālĕllā didda appuḍe vesaridi

(||pinna||)
nāḍiga nĕvvadĕ yalavāḍu sesĕnayyā
vīḍĕbumovi yichchi vesāridi
yīḍane śhrīveṁkaḍeśha yelugŏṁṭi venayyā
kūḍina nīradu lĕṁchigŏni ne vesaridi