Pinnadaana vaide nemi peddagaadaa valabu

పిన్నదాన వైతే నేమి పెద్దగాదా వలపు
Language

(॥పల్లవి॥)
పిన్నదాన వైతే నేమి పెద్దగాదా వలపు
చన్నులపైఁ బయ్యదే సారెఁ గప్పేవూ

(॥॥)
ఆడరాదా వొకమాట ఆతనితోను
యీడనుండే సిగ్గువడి యేల లోఁగేవు
చూడరాదా పతిదిక్కు సొలయుచును
వీడెము చేఁబట్టుక మా వెనక నున్నదానవూ

(॥॥)
కానుక లియ్యఁ గరాదా కౌఁగిలిమ్మని
వేసలి వీడగఁ నేల వెర గందేవు
పూని పాదా లొత్తరాదా వొద్దఁగూచుండి
నానించి మా మోము చూచి నవ్వు నవ్వేవూ

(॥॥)
సేయరాదా వూడిగాలు చెలువునికి
చాయలా సన్నల నేల జంపు సేసేవు
ఈయడ శ్రీ వేంకటేశుఁడిదే తానె నిన్నుఁగూడె
మాయడకు దాఁపురాలు మరి యేలసేసేవూ

(||pallavi||)
pinnadāna vaide nemi pĕddagādā valabu
sannulabaim̐ bayyade sārĕm̐ gappevū

(||||)
āḍarādā vŏgamāḍa ādanidonu
yīḍanuṁḍe sigguvaḍi yela lom̐gevu
sūḍarādā padidikku sŏlayusunu
vīḍĕmu sem̐baṭṭuga mā vĕnaga nunnadānavū

(||||)
kānuga liyyam̐ garādā kaum̐gilimmani
vesali vīḍagam̐ nela vĕra gaṁdevu
pūni pādā lŏttarādā vŏddam̐gūsuṁḍi
nāniṁchi mā momu sūsi navvu navvevū

(||||)
seyarādā vūḍigālu sĕluvunigi
sāyalā sannala nela jaṁpu sesevu
īyaḍa śhrī veṁkaḍeśhum̐ḍide tānĕ ninnum̐gūḍĕ
māyaḍagu dām̐purālu mari yelasesevū