పిండికూరలో నలుపులు నేఁ బెనఁగి యేరఁగ నోప । తన్ను ।
(॥పల్లవి॥)
పిండికూరలో నలుపులు నేఁ బెనఁగి యేరఁగ నోప । తన్ను ।
చండి సేయఁగ రాదు యిఁక సరుగఁ గూచుండు మనవే యమ్మా
(॥సిండి॥)
వేగి మిలిచినచీఁకటి వీఁడేల తడవీ మమ్ము
ఆగడము రాతి రెల్ల సతులు ఆడఁ జేయట చాలదా
యీగతులు నేనెఱఁగనా మరియు యేల రేఁచీమమ్మును
జాగులన్నియును యిఁకచాలుఁ గూచుండుమనరేయమ్మా
(॥సిండి॥)
పూస గుచ్చినదారము పోనీఁడు తా నన్నును
వాసితో వీరి వారి వెనువెంట వలలఁ దిరుగుట చాలదా
సేసినవి తా నెరఁగఁడా చెప్పఁ బోతే నవ్వులు
ఆసఁ దన కెపుడుగలదూ యిఁక నాయఁగూచుండుమనరేయమ్మా
(॥సిండి॥)
పూవుల పూఁపలువలెనె పొసఁగఁ దా నన్నుఁ గూడె
భావమున తలఁచి తలఁచి కూడెటిభావరతులెచాలదా
సేవ లెల్లనుఁ జేసితి నేఁడు శ్రీవెంకటేశ్వరునికి
యీవేళ నేఁ దనిసితి యెపుడు నిట్లఁ గూచుండు మనరేయమ్మా
(||pallavi||)
piṁḍigūralo nalubulu nem̐ bĕnam̐gi yeram̐ga noba | tannu |
saṁḍi seyam̐ga rādu yim̐ka sarugam̐ gūsuṁḍu manave yammā
(||siṁḍi||)
vegi milisinasīm̐kaḍi vīm̐ḍela taḍavī mammu
āgaḍamu rādi rĕlla sadulu āḍam̐ jeyaḍa sāladā
yīgadulu nenĕṟam̐ganā mariyu yela rem̐sīmammunu
jāgulanniyunu yim̐kasālum̐ gūsuṁḍumanareyammā
(||siṁḍi||)
pūsa guchchinadāramu ponīm̐ḍu tā nannunu
vāsido vīri vāri vĕnuvĕṁṭa valalam̐ diruguḍa sāladā
sesinavi tā nĕram̐gam̐ḍā sĕppam̐ bode navvulu
āsam̐ dana kĕbuḍugaladū yim̐ka nāyam̐gūsuṁḍumanareyammā
(||siṁḍi||)
pūvula pūm̐paluvalĕnĕ pŏsam̐gam̐ dā nannum̐ gūḍĕ
bhāvamuna talam̐si talam̐si kūḍĕḍibhāvaradulĕsāladā
seva lĕllanum̐ jesidi nem̐ḍu śhrīvĕṁkaḍeśhvarunigi
yīveḽa nem̐ danisidi yĕbuḍu niṭlam̐ gūsuṁḍu manareyammā