Piluvave yeedagu besabelli yaadani

పిలువవే యీడకు బేసబెల్లి యాతని
Language

(॥పల్లవి॥)
పిలువవే యీడకు బేసబెల్లి యాతని
చిలుపాలు గాఁపించె సిగ్గులెల్లాను

(॥పిలు॥)
వలవనిజోలిఁ బెట్టి వట్టిమాటలెల్లా నాడి
తలపోఁతవలపులఁదమి రేఁచెను
మొలకలనవ్వు మొనగోరికొన వ్రాసి
నిలువు నూరు పండించె నిన్న నెల్లాను

(॥పిలు॥)
సరసము పైఁజల్లి జాగరాలు సేయింపించి
కరఁగించి మర్మముల కళ లుబ్బించె
తెరవేసి మరఁగున తేనెమోవి యాసచూపి
పరగించె నెమ్మెలెల్లా బలుమేడమీఁదను

(॥పిలు॥)
కన్నుల సన్నలుసేసి కాయము కాఁగిట నించి
నన్ను నింతగాఁ జేసి నమ్మించెను
ఇన్నిటా శ్రీవేంకటేశుఁడిపుడు వచ్చి కలసె
విన్నపములెల్లాను వినె నిందాఁకాను

(||pallavi||)
piluvave yīḍagu besabĕlli yādani
silubālu gām̐piṁchĕ siggulĕllānu

(||pilu||)
valavanijolim̐ bĕṭṭi vaṭṭimāḍalĕllā nāḍi
talabom̐tavalabulam̐dami rem̐sĕnu
mŏlagalanavvu mŏnagorigŏna vrāsi
niluvu nūru paṁḍiṁchĕ ninna nĕllānu

(||pilu||)
sarasamu paim̐jalli jāgarālu seyiṁpiṁchi
karam̐giṁchi marmamula kaḽa lubbiṁchĕ
tĕravesi maram̐guna tenĕmovi yāsasūbi
paragiṁchĕ nĕmmĕlĕllā balumeḍamīm̐danu

(||pilu||)
kannula sannalusesi kāyamu kām̐giḍa niṁchi
nannu niṁtagām̐ jesi nammiṁchĕnu
inniḍā śhrīveṁkaḍeśhum̐ḍibuḍu vachchi kalasĕ
vinnabamulĕllānu vinĕ niṁdām̐kānu