పిలువరె యింకాను ప్రియము చెప్పేఁ గాని
(॥పల్లవి॥)
పిలువరె యింకాను ప్రియము చెప్పేఁ గాని
చల మేల నెరపీనె సారెకుఁ దానూ
(॥పిలువరె॥)
తప్పు లెంచఁ బని లేదు తానె నే నైనచోట
కప్పురము గొమ్మనవె కపటా లేల
యిప్పుడు నాప్రియములు యిందాఁకా నియ్యకొనె
అప్పటి నేల వున్నదె ఆడనె తాను
(॥పిలువరె॥)
కోపగించఁ బని లేదు కూడితి మిద్దర మీడ
చూపులఁ జూడు మనవె సూడుఁబా డేల
యీ పొద్దుదాఁకా మాట లియ్యకొన్నట్టె వుండె
యేపునఁ దెరలోని కే లేఁగీనె తాను
(॥పిలువరె॥)
ఆన వెట్టఁబని లేదు ఆయా లిద్దరికి సోఁకె
పూని కూచుండు మనవె బూటకా లేలా
నేనె శ్రీవెంకటపతిఁ దానె యలమేలుమంగ
మానక కూడితి మిఁక మంచ మెక్క నేఁటికే
(||pallavi||)
piluvarĕ yiṁkānu priyamu sĕppem̐ gāni
sala mela nĕrabīnĕ sārĕgum̐ dānū
(||piluvarĕ||)
tappu lĕṁcham̐ bani ledu tānĕ ne nainasoḍa
kappuramu gŏmmanavĕ kabaḍā lela
yippuḍu nāpriyamulu yiṁdām̐kā niyyagŏnĕ
appaḍi nela vunnadĕ āḍanĕ tānu
(||piluvarĕ||)
kobagiṁcham̐ bani ledu kūḍidi middara mīḍa
sūbulam̐ jūḍu manavĕ sūḍum̐bā ḍela
yī pŏddudām̐kā māḍa liyyagŏnnaṭṭĕ vuṁḍĕ
yebunam̐ dĕraloni ke lem̐gīnĕ tānu
(||piluvarĕ||)
āna vĕṭṭam̐bani ledu āyā liddarigi som̐kĕ
pūni kūsuṁḍu manavĕ būḍagā lelā
nenĕ śhrīvĕṁkaḍabadim̐ dānĕ yalamelumaṁga
mānaga kūḍidi mim̐ka maṁcha mĕkka nem̐ṭige