పిలువరే యీ కాంత ప్రియునిని
(॥పల్లవి॥)
పిలువరే యీ కాంత ప్రియునిని
కలయికలనే మేలు గలిగీఁగాక
(॥పలువ॥)
తలపోఁతలచేతఁ దతిగొన్న విరహము
చలిమందులచేత జడిసీనా
పలుకుఁదేనెలచేతఁ బ్రబలిన తరితీపు
తలిరుల మూసితే దాఁగీనా
(॥పలువ॥)
యెదురుచూపులనే యెసగిన తమకము
పొదిగిన విరులచేఁ బోయీనా
పొదిగొన్న యాసలఁ బొడమిన యలపులు
వుదుటు సురటులచే నుడిగీనా
(॥పలువ॥)
దండనే వినుకలిఁ దగిలిన చెలుములు
పండువెన్నెలచేతఁ బరసీనా
నిండార శ్రీవేంకటనిలయుఁ డీచెలిఁ గూడె
వొండొక తావుననుంటే వొద్దిక వాసీనా
(||pallavi||)
piluvare yī kāṁta priyunini
kalayigalane melu galigīm̐gāga
(||paluva||)
talabom̐talasedam̐ dadigŏnna virahamu
salimaṁdulaseda jaḍisīnā
palugum̐denĕlasedam̐ brabalina taridību
talirula mūside dām̐gīnā
(||paluva||)
yĕdurusūbulane yĕsagina tamagamu
pŏdigina virulasem̐ boyīnā
pŏdigŏnna yāsalam̐ bŏḍamina yalabulu
vuduḍu suraḍulase nuḍigīnā
(||paluva||)
daṁḍane vinugalim̐ dagilina sĕlumulu
paṁḍuvĕnnĕlasedam̐ barasīnā
niṁḍāra śhrīveṁkaḍanilayum̐ ḍīsĕlim̐ gūḍĕ
vŏṁḍŏga tāvunanuṁṭe vŏddiga vāsīnā