Piluvaga vachchidimi peradaamdlamu

పిలువక వచ్చితిమి పేరటాండ్లము
Language

(॥పల్లవి॥)
పిలువక వచ్చితిమి పేరటాండ్లము
సొలసి సొలసి మీపైన సోబానఁ బాడేము

(॥॥)
చుక్కబొట్టు వెట్టుకొని సూసరము గట్టుకొని
నిక్కినిక్కి చూచీ నాపె నీదిక్కు
పిక్కటిల్ల నీకు నాపె పెండ్లికూఁతురాయనో
చొక్కముగఁ జెప్పవయ్య సోబానఁ బాడేము

(॥॥)
ముప్పిరినవ్వులతోడ ముఁజేతి కంకణముతో
చిప్పిల నీ యెదుటను సిగ్గువడీని
దెప్పరమై తానుఁ గొత్తదేవులు నీకాయనో
చొప్పులెత్తి చెప్పవయ్య సోబానఁ బాడేము

(॥॥)
తాళి మెడఁ గట్టుకొని దైవారాఁ బసపు పూసి
ఆలాయనో తాను అప్పుడే నీకు
యేలితివి వేంకటేశ నన్ను నింతలోనే
సోలి నింకాఁ జెప్పవయ్య సోబానఁ బాడేము

(||pallavi||)
piluvaga vachchidimi peraḍāṁḍlamu
sŏlasi sŏlasi mībaina sobānam̐ bāḍemu

(||||)
sukkabŏṭṭu vĕṭṭugŏni sūsaramu gaṭṭugŏni
nikkinikki sūsī nābĕ nīdikku
pikkaḍilla nīgu nābĕ pĕṁḍligūm̐turāyano
sŏkkamugam̐ jĕppavayya sobānam̐ bāḍemu

(||||)
muppirinavvuladoḍa mum̐jedi kaṁkaṇamudo
sippila nī yĕduḍanu sigguvaḍīni
dĕpparamai tānum̐ gŏttadevulu nīgāyano
sŏppulĕtti sĕppavayya sobānam̐ bāḍemu

(||||)
tāḽi mĕḍam̐ gaṭṭugŏni daivārām̐ basabu pūsi
ālāyano tānu appuḍe nīgu
yelidivi veṁkaḍeśha nannu niṁtalone
soli niṁkām̐ jĕppavayya sobānam̐ bāḍemu