(॥పల్లవి॥)
పిలువాఁ గదరే ప్రియునిని
చలువా లాతఁడు చల్లీఁగాని
(॥॥)
తలఁపారా దింతి తమకము రేఁగి
చెలపాచెమటాయ చెక్కులను
పొలపా వెన్నెలపోగులకు మతి-
గొలుపా దీకె కెక్కుడువిరహమునా
(॥॥)
కెరలి మును మరిగినపొందూ లోలో
మరలీ కాఁకలై మనసుననూ
పొరలీఁ బూఁబానుపున నీపెకు వాడు-
దొరలీఁ దియ్యరె తొలువిరులెల్లా
(॥॥)
అలసె మోహపుటాసల కడు
బలిసెఁ జన్నులు పైపైనే
కలసె శ్రీ వేంకటపతి మారు-
మలసే విదివో మరుబలములకూ
(||pallavi||)
piluvām̐ gadare priyunini
saluvā lādam̐ḍu sallīm̐gāni
(||||)
talam̐pārā diṁti tamagamu rem̐gi
sĕlabāsĕmaḍāya sĕkkulanu
pŏlabā vĕnnĕlabogulagu madi-
gŏlubā dīgĕ kĕkkuḍuvirahamunā
(||||)
kĕrali munu mariginabŏṁdū lolo
maralī kām̐kalai manasunanū
pŏralīm̐ būm̐bānubuna nībĕgu vāḍu-
dŏralīm̐ diyyarĕ tŏluvirulĕllā
(||||)
alasĕ mohabuḍāsala kaḍu
balisĕm̐ jannulu paibaine
kalasĕ śhrī veṁkaḍabadi māru-
malase vidivo marubalamulagū