Piluva vachchidi nenu priyuraali kadanumdi

పిలువ వచ్చితి నేను ప్రియురాలి కడనుండి
Language

(॥పల్లవి॥)
పిలువ వచ్చితి నేను ప్రియురాలి కడనుండి
యెలమి నా మాటవిని యింటికి రావయ్యా

(॥పిలు॥)
పచ్చిదేరి వలపులు పడఁతికి నీకు నేఁడు
కొచ్చి కొచ్చి తమకము గుబ్బతిలీని
విచ్చన విడాయను వేడుకతో సరసాలు
యెచ్చుగుందు రిఁక నేల యింటికి రావయ్యా

(॥పిలు॥)
నివ్వటిల్లె వయసులు నెలఁతకు నీకు నేఁడు
వువ్విళ్ళూరీ మీలోని వొడఁబాటులు
చివ్వనఁ బురిగొనెను చిగిరింత సిగ్గులు
యెవ్వరూ నేమి చెప్పేరు యింటికి రావయ్యా

(॥పిలు॥)
అందుకొనె నాసలు అంగనకు నీకు నేఁడు
కందువ రతులు తారుకాణాలాయను
పొందుగా శ్రీవేంకటేశ భోగించితి వీకెను
యిందరూ మెచ్చిరి నిన్ను యింటి కిట్టె రావయ్యా

(||pallavi||)
piluva vachchidi nenu priyurāli kaḍanuṁḍi
yĕlami nā māḍavini yiṁṭigi rāvayyā

(||pilu||)
pachchideri valabulu paḍam̐tigi nīgu nem̐ḍu
kŏchchi kŏchchi tamagamu gubbadilīni
vichchana viḍāyanu veḍugado sarasālu
yĕchchuguṁdu rim̐ka nela yiṁṭigi rāvayyā

(||pilu||)
nivvaḍillĕ vayasulu nĕlam̐tagu nīgu nem̐ḍu
vuvviḽḽūrī mīloni vŏḍam̐bāḍulu
sivvanam̐ burigŏnĕnu sigiriṁta siggulu
yĕvvarū nemi sĕpperu yiṁṭigi rāvayyā

(||pilu||)
aṁdugŏnĕ nāsalu aṁganagu nīgu nem̐ḍu
kaṁduva radulu tārugāṇālāyanu
pŏṁdugā śhrīveṁkaḍeśha bhogiṁchidi vīgĕnu
yiṁdarū mĕchchiri ninnu yiṁṭi kiṭṭĕ rāvayyā