Pilusugavachchidivaa priyuni needagu nemdu

పిలుచుకవచ్చితివా ప్రియుని నీడకు నేఁడు
Language

(॥పల్లవి॥)
పిలుచుకవచ్చితివా ప్రియుని నీడకు నేఁడు
తలపోసి తలపోసి తడబడీ నాసలు

(॥పిలు॥)
కుప్పలాయఁ దెప్పలాయఁ గోరికలు నాకు నేఁడు
యెప్పుడు వచ్చునే పతి యేమే చెలియా
చెప్పరాదు చూపరాదు చిత్తములో తమకము
కుచ్చళించినట్లు మేనఁ గురిసీఁ జెమటలు

(॥పిలు॥)
తతివచ్చె మితివచ్చె తప్పక నాజవ్వనము
అతఁ డేమిసేసీనే ఆడఁ జెలియా
రతికెక్కె నుతికెక్కె రాఁపుల నావలపులు
చతురతఁ జిమ్మిరేఁగీ సారె నావేడుకలు

(॥పిలు॥)
పచ్చిదేరీ మెచ్చువారీ పైకొన్ననాకూటములు
ఇచ్చల శ్రీవేంకటేశుఁ డేలెఁ జెలియా
తచ్చనేల గిచ్చనేల దాకొనె సంతోసాలు
అచ్చమై యతనిమీఁద నమరీ మచ్చికలు

(||pallavi||)
pilusugavachchidivā priyuni nīḍagu nem̐ḍu
talabosi talabosi taḍabaḍī nāsalu

(||pilu||)
kuppalāyam̐ dĕppalāyam̐ gorigalu nāgu nem̐ḍu
yĕppuḍu vachchune padi yeme sĕliyā
sĕpparādu sūbarādu sittamulo tamagamu
kuchchaḽiṁchinaṭlu menam̐ gurisīm̐ jĕmaḍalu

(||pilu||)
tadivachchĕ midivachchĕ tappaga nājavvanamu
adam̐ ḍemisesīne āḍam̐ jĕliyā
radigĕkkĕ nudigĕkkĕ rām̐pula nāvalabulu
saduradam̐ jimmirem̐gī sārĕ nāveḍugalu

(||pilu||)
pachchiderī mĕchchuvārī paigŏnnanāgūḍamulu
ichchala śhrīveṁkaḍeśhum̐ ḍelĕm̐ jĕliyā
tachchanela gichchanela dāgŏnĕ saṁtosālu
achchamai yadanimīm̐da namarī machchigalu