Pilisee nee ramanumdu priyamu segonamgade

పిలిచీ నీ రమణుఁడు ప్రియము చేకొనఁగదె
Language

(॥పల్లవి॥)
పిలిచీ నీ రమణుఁడు ప్రియము చేకొనఁగదె
కొలచితేఁ దమకము కుప్పలై నిలుచును

(॥పిలి॥)
ఇచ్చకమెఱఁగనట్టి ఇంతి పొందు సేసితేను
మచ్చరము రేఁగును మగవానికి
విచ్చనవిడి నూరకె వెంగెములే యాడితేను
వచ్చి వచ్చి యేడాలేనివాసులే పుట్టును

(॥పిలి॥)
చెంతనుండి కూడని చెలితోడ నవ్వతేను
పంతములే మిగులును పతివద్దను
రంతుచేసి యేకతాలు రచ్చలవేసితేను
చింతతోడ మిగులాను సిగ్గులే నెరసును

(॥పిలి॥)
సమ్మతించఁజాలనిసతిఁ గాఁగిలించితేను
యెమ్మెలే మించు శ్రీవేంకటేశునకు
కమ్మి యాతఁడె నన్నేలె కతలిట్టె చెప్పితేను
నెమ్మన మలరం గడు నెయ్యములే పుట్టును

(||pallavi||)
pilisī nī ramaṇum̐ḍu priyamu segŏnam̐gadĕ
kŏlasidem̐ damagamu kuppalai nilusunu

(||pili||)
ichchagamĕṟam̐ganaṭṭi iṁti pŏṁdu sesidenu
machcharamu rem̐gunu magavānigi
vichchanaviḍi nūragĕ vĕṁgĕmule yāḍidenu
vachchi vachchi yeḍālenivāsule puṭṭunu

(||pili||)
sĕṁtanuṁḍi kūḍani sĕlidoḍa navvadenu
paṁtamule migulunu padivaddanu
raṁtusesi yegadālu rachchalavesidenu
siṁtadoḍa migulānu siggule nĕrasunu

(||pili||)
sammadiṁcham̐jālanisadim̐ gām̐giliṁchidenu
yĕmmĕle miṁchu śhrīveṁkaḍeśhunagu
kammi yādam̐ḍĕ nannelĕ kadaliṭṭĕ sĕppidenu
nĕmmana malaraṁ gaḍu nĕyyamule puṭṭunu