Pidigidi talambaala pemdligoodura nenu

పిడికిటి తలఁబాల పెండ్లికూతుర నేను
Language

(॥పల్లవి॥)
పిడికిటి తలఁబాల పెండ్లికూతుర నేను
వొడివట్టి తియ్యకున్న వూరకే యేమాయెను

(॥పడికి॥)
కనుఁగొన నిచ్చితివి కడుమోహ మిచ్చితివి
మనసియ్యకుండితేను మరేమాయెను
పెనఁగఁగఁ జేసితివి బెట్టు రట్టు సేసితివి
ననుఁ బొందుసేయకున్న నడుమ నేమాయెను

(॥పడికి॥)
సడి నాపై వేసితి వాసలఁ గింద వేసితివి
యెడసి చేవేయకున్న నేమాయెను
వడి సటలాడితివి వట్టి మేలాలాడితివి
కడు జూజాలాడకున్న కమ్మటి నేమాయెను

(॥పడికి॥)
జట్టి నొట్టు వెట్టితివి సవతులఁ బెట్టితివి
యిట్టె తమ్మ వెట్టికున్న నేమాయెను
గుట్టున శ్రీ వేంకటేశ కూడి కోపమాఁపితివి
అట్టె తమి యాఁపకున్న అందుకు నేమాయను

(||pallavi||)
piḍigiḍi talam̐bāla pĕṁḍligūdura nenu
vŏḍivaṭṭi tiyyagunna vūrage yemāyĕnu

(||paḍigi||)
kanum̐gŏna nichchidivi kaḍumoha michchidivi
manasiyyaguṁḍidenu maremāyĕnu
pĕnam̐gam̐gam̐ jesidivi bĕṭṭu raṭṭu sesidivi
nanum̐ bŏṁduseyagunna naḍuma nemāyĕnu

(||paḍigi||)
saḍi nābai vesidi vāsalam̐ giṁda vesidivi
yĕḍasi seveyagunna nemāyĕnu
vaḍi saḍalāḍidivi vaṭṭi melālāḍidivi
kaḍu jūjālāḍagunna kammaḍi nemāyĕnu

(||paḍigi||)
jaṭṭi nŏṭṭu vĕṭṭidivi savadulam̐ bĕṭṭidivi
yiṭṭĕ tamma vĕṭṭigunna nemāyĕnu
guṭṭuna śhrī veṁkaḍeśha kūḍi kobamām̐pidivi
aṭṭĕ tami yām̐pagunna aṁdugu nemāyanu