పెట్టినవి నీ సొమ్ములు కట్టినది నీ రెంటెము
(॥పల్లవి॥)
పెట్టినవి నీ సొమ్ములు కట్టినది నీ రెంటెము
యిట్టిదాన నేను యేమి చూచేనయ్యా
(॥పట్టిన॥)
కతలు చెప్పితి నీకు కైకొని వేగినంతాను
వెతల చెమట లార విసరితిని
మతిలో నున్నపనులు మఱి నే నేమి నెఱుఁగ
సతుల నాయింటి కేల సారె నంపేవయ్యా
(॥పట్టిన॥)
నిద్దుర వోకుండఁగాను నీ వొద్దనే కూచుండితి
గద్దించి నీ కాఁక దేర కప్ర మిచ్చితి
సుద్దులే కాని యింకా చుట్టరికా లెఱుఁగను
పెద్దరికాలకు నేల పిలిపించేవయ్యా
(॥పట్టిన॥)
పానుపుపై బోరలఁగా పడఁతి నీకుఁ దోడుగా
కానిమ్మని వెలయఁగాఁ గౌఁగిలించితి
మౌనాన నుండితి గాని మరి నిన్ను బాసడుగ
వూని శ్రీవేంకటేశుఁడ పొగడ నేలయ్యా
(||pallavi||)
pĕṭṭinavi nī sŏmmulu kaṭṭinadi nī rĕṁṭĕmu
yiṭṭidāna nenu yemi sūsenayyā
(||paṭṭina||)
kadalu sĕppidi nīgu kaigŏni veginaṁtānu
vĕdala sĕmaḍa lāra visaridini
madilo nunnabanulu maṟi ne nemi nĕṟum̐ga
sadula nāyiṁṭi kela sārĕ naṁpevayyā
(||paṭṭina||)
niddura voguṁḍam̐gānu nī vŏddane kūsuṁḍidi
gaddiṁchi nī kām̐ka dera kapra michchidi
suddule kāni yiṁkā suṭṭarigā lĕṟum̐ganu
pĕddarigālagu nela pilibiṁchevayyā
(||paṭṭina||)
pānububai boralam̐gā paḍam̐ti nīgum̐ doḍugā
kānimmani vĕlayam̐gām̐ gaum̐giliṁchidi
maunāna nuṁḍidi gāni mari ninnu bāsaḍuga
vūni śhrīveṁkaḍeśhum̐ḍa pŏgaḍa nelayyā