పెట్టిన నీ వెఱుఁగుదు పెనుదిక్కు
(॥పల్లవి॥)
పెట్టిన నీ వెఱుఁగుదు పెనుదిక్కు
జట్టిగా శ్రీహరి నీకు శరణు చొచ్చితిమి
(॥పెట్టి॥)
కర్మమూలమైనట్టి కాయము మోచి నేను
కర్మము విడువఁబోతే కడుసంగతా
మర్మ మెఱిఁగిన నీవే మాయలఁ గట్టుండఁగాను
పేర్మి నే విడువఁబోతే బిగియదా కట్టు
(॥పెట్టి॥)
బంధమూలమైనట్టి ప్రపంచమందునుండి
బంధముఁ బాసేనంటేఁ బాసునా అది
అంధకారమైనట్టి అజ్ఞానానఁ దోసితివి
అంధకారమున వెలుఁ గరసితేఁ గలదా
(॥పెట్టి॥)
నిచ్చలు నీసంసారపు నీరధిలోన మునిఁగి
చొచ్చి వెళ్లి చేరేనంటేఁ జోటు గలదా
యిచ్చట శ్రీవేంకటేశ యిహమందే పరమిచ్చి
అచ్చు మోపి యేలఁగా నే నన్నియుఁ దెలిసితి
(||pallavi||)
pĕṭṭina nī vĕṟum̐gudu pĕnudikku
jaṭṭigā śhrīhari nīgu śharaṇu sŏchchidimi
(||pĕṭṭi||)
karmamūlamainaṭṭi kāyamu mosi nenu
karmamu viḍuvam̐bode kaḍusaṁgadā
marma mĕṟim̐gina nīve māyalam̐ gaṭṭuṁḍam̐gānu
permi ne viḍuvam̐bode bigiyadā kaṭṭu
(||pĕṭṭi||)
baṁdhamūlamainaṭṭi prabaṁchamaṁdunuṁḍi
baṁdhamum̐ bāsenaṁṭem̐ bāsunā adi
aṁdhagāramainaṭṭi ajñānānam̐ dosidivi
aṁdhagāramuna vĕlum̐ garasidem̐ galadā
(||pĕṭṭi||)
nichchalu nīsaṁsārabu nīradhilona munim̐gi
sŏchchi vĕḽli serenaṁṭem̐ joḍu galadā
yichchaḍa śhrīveṁkaḍeśha yihamaṁde paramichchi
achchu mobi yelam̐gā ne nanniyum̐ dĕlisidi