Perum geerdigaavale birudulu vere yela

పేరుఁ గీర్తిగావలె బిరుదులు వేరె యేల
Language

(॥పల్లవి॥)
పేరుఁ గీర్తిగావలె బిరుదులు వేరె యేల
ఆ రీతి నా పఁ(పం?)త మిదె అటు చూడరాదా

(॥పరుఁ॥)
కన్నెను నామోహము నీకాళ్లఁ బెనఁగించకుంటే
నన్నుఁ జూచి నీ వప్పుడు నవ్వరాదా
యెన్ని చెప్పినా రావు యిదె నా నిట్టూర్పుగాలి
దిన్నలై రాసులువోసితే మెచ్చరాదా

(॥పరు॥)
తక్కక నాజవ్వనము తరపు వెట్టించకుంటే
పెక్కువతో నొండుపేరు వెట్టరాదా
చక్కనుండ వెఁ(వెం)తైనా సటలకుఁ దిరిగేవు
ముక్కులబంటి గావలె ముదు(ద)లియ్యరాదా

(॥పరుఁ॥)
మంతనపునామాటలు మర్మాలు నాటించకుంటే
అంతవింతా నీవు వెంగేలాడరాదా
చెంతల శ్రీవేంకటేశ చేకొని కూడితివి నఁ
న్నంతటాఁ బొగడవలె నటు చూడరాదా

(||pallavi||)
perum̐ gīrdigāvalĕ birudulu verĕ yela
ā rīdi nā pam̐(paṁ?)ta midĕ aḍu sūḍarādā

(||parum̐||)
kannĕnu nāmohamu nīgāḽlam̐ bĕnam̐giṁchaguṁṭe
nannum̐ jūsi nī vappuḍu navvarādā
yĕnni sĕppinā rāvu yidĕ nā niṭṭūrbugāli
dinnalai rāsuluvoside mĕchcharādā

(||paru||)
takkaga nājavvanamu tarabu vĕṭṭiṁchaguṁṭe
pĕkkuvado nŏṁḍuberu vĕṭṭarādā
sakkanuṁḍa vĕm̐(vĕṁ)tainā saḍalagum̐ dirigevu
mukkulabaṁṭi gāvalĕ mudu(da)liyyarādā

(||parum̐||)
maṁtanabunāmāḍalu marmālu nāḍiṁchaguṁṭe
aṁtaviṁtā nīvu vĕṁgelāḍarādā
sĕṁtala śhrīveṁkaḍeśha segŏni kūḍidivi nam̐
nnaṁtaḍām̐ bŏgaḍavalĕ naḍu sūḍarādā